Begin typing your search above and press return to search.
#TRP బిగ్ బాస్ రాంగ్ టైమింగ్.. కొంప ముంచిన IPL
By: Tupaki Desk | 25 Sept 2020 10:15 AM ISTబిగ్ బాస్ సీజన్ 4 చాలా హైప్ తో భారీ అంచనాలతో మొదలైంది. దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్ తో పాటు కరోనా కారణంగా ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ కుదైలైపోవడంతో వీక్షకులకు వినోదం కరువైపోయింది. దీంతో చాలా మంది వినోదం కోసం టీవీ ఇండస్ట్రీ నే నమ్ముకున్నారు. అందు లోనూ బిగ్ బాస్ సీజన్ 4పై ప్రత్యేక ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు.
దీంతో బిగ్ బాస్ కు దేశ వ్యాప్తంగా మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ప్రారంభం లో ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్ విషయంలో నాగార్జుననే విస్మయానికి గురిచేసింది. లైమ్ లైట్ లో లేని కంటెస్టెంట్ లు కావడంతో ఈ షోకి అనుకున్నంత గా హైప్ వుండదనే ప్రచారం జరిగినా దానికి పూర్తి భిన్నం గా టీఆర్పీ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ షోని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించారని మొదటి వారంలో రికార్డు స్థాయిలో 18.5 టీఆర్పీ రేటింగ్ లభించిందని సదరు టీవీ ఛానల్ ప్రకటించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ షోని ప్రతి 3 మందిలో ఇద్దరు చూశారని స్వయంగా నాగార్జున ప్రకటించారు. గత సీజన్ లతో పోలిస్తే ఇది రికార్డ్ అని స్పష్టం చేశారు. కానీ తాజాగా ఐపీఎల్ సీజన్ బిగ్ బాస్ కి భారీగా దెబ్బేసిందని తెలుస్తోంది. ఇటీవలే ఐపీఎల్ స్టార్టయింది. దీంతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ప్రమాద కర స్థాయికి పడిపోవడం బిగ్ బాస్ మేకర్స్ ని కలవరానికి గురిచేస్తోంది. ఈ షో రెండవ వారాంతంలో 10.7 రేటింగ్ ని పొందిందని, మొత్తం వారంలో రేటింగ్ 8.05కి చేరడం ఆందోళన కలిగిస్తోందిని చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే ఇటు తెలుగు బిగ్ బాస్ సహా హిందీ బిగ్ బాస్ అలాగే ఇరుగు పొరుగు భాషల్లో బిగ్ బాస్ కొత్త సీజన్లు ఇటీవలే ప్రారంభం కావడం ఇంతలోనే ఐపీఎల్ ఉప్పెనలా ముంచుకు రావడం బిగ్ పంచ్ అన్న చర్చా సాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే మహమ్మారీ వేళ.. రైట్ టైమ్ లో స్టార్ట్ చేసినా రాంగ్ టైమింగ్ ముంచుకొచ్చిందని దీనిని బట్టి అర్థం చేసుకోవాలి.