Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : ఉత్కంఠభరితంగా నందిత 'ఐపీసీ 376'

By:  Tupaki Desk   |   2 July 2020 12:27 PM GMT
ట్రైలర్ టాక్ : ఉత్కంఠభరితంగా నందిత ఐపీసీ 376
X
నందిత శ్వేత నటించిన తాజా చిత్రం 'ఐపీసీ 376'. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' 'ప్రేమ కథా చిత్రమ్ 2' 'అభినేత్రి 2' లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అదరగొట్టబోతోంది. ఇప్పటికే 'ఐపీసీ 376' సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 1. 23 నిముషాలు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

''రేప్ చేస్తారు.. ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలని బ్రతకనివ్వరా రా'' అంటూ నందిత శ్వేత చెప్పే డైలాగ్ ని బట్టి చూస్తే ఈ సినిమా మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాడే విధంగా కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. ఇక లైంగిక దాడులు అత్యాచారం నేరం చేసిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 376 ప్రకారం శిక్ష విధిస్తారు. టైటిల్ ని బట్టి చూసుకున్నా సినిమా నేపథ్యం అత్యాచార సంఘటన చుట్టూ సాగుతుందని అనుకోవచ్చు. అంతేకాకుండా ''మన చుట్టూ జరిగే అమానుషాలకి సైన్టిఫిక్ ఎక్సప్లనేషన్స్ ఉన్నాయి. దెయ్యాలు అనేవి అస్సలు లేవు'' అంటూ హారర్ అంశాలను కూడా ఈ ట్రైలర్ లో జత చేశారు. 'ఇంఫార్మర్ అన్ నోన్ అతనిచ్చిన మెసేజ్ అన్ నోన్ ఒక అన్ నోన్ కోసం ఇంత కష్టపడాలా చెప్పండి' 'చావు అనేది శత్రువులు తీర్మానించకూడదు.. ఆ దేవుడు తీర్మానించాలి' అనే డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈరోజు రిలీజైన 'ఐపీసీ 376' ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

హారర్ - సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నందిత పోలీస్ ఆఫీసర్ గా బాగానే సెట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక నందిత కొన్ని సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించడంతో పాటు కాలికి గాయాలైనా పెద్దగా పట్టించుకోకుండా ఆ సన్నివేశాన్ని పూర్తిచేశారట. మొత్తం మీద నందిత మరో డిఫరెంట్ కథతో ఈసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుందని అర్థం అవుతోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. కాగా 'ఐపీసీ 376' సినిమాకి రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పవర్ కింగ్ స్టూడియోస్ బ్యానర్ లో ఎస్. ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి