Begin typing your search above and press return to search.

'గని' వరల్డ్ లోని స్ట్రాంగ్ రోల్స్..!

By:  Tupaki Desk   |   11 Nov 2021 6:10 AM GMT
గని వరల్డ్ లోని స్ట్రాంగ్ రోల్స్..!
X
'ఎఫ్ 2' 'గద్దలకొండ గణేష్' వంటి వరుస హిట్స్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గని''. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'గని' సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు - గ్లిమ్స్ - ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో గని వరల్డ్ లోని క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ చిత్ర బృందం తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా - సీనియర్ నరేష్ - తనికెళ్ళ భరణి - ఉపేంద్ర - సునీల్ శెట్టి - జగపతిబాబు - నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాక్సర్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లే గని జీవితంలో ఈ పాత్రలన్నీ ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇకపోతే నవంబర్ 15న 'గని' టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ''గని'' చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రెనసాన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై అల్లు వెంకటేష్ - సిద్ధు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నారు.

అబ్బూరి రవి ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవల్ మరియు దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.