Begin typing your search above and press return to search.

ఆస్కార్ అత‌డు ఎప్పుడూ న‌గ్నంగా ఉండేది అందుకేనా?

By:  Tupaki Desk   |   21 Aug 2022 1:30 PM GMT
ఆస్కార్ అత‌డు ఎప్పుడూ న‌గ్నంగా ఉండేది అందుకేనా?
X
ఆస్కార్ అవార్డు.. ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క న‌టుడు, న‌టి క‌ల‌. జీవితంలో ఒక్క‌సారైనా ఆస్కార్ అవార్డు తీసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క న‌టి, న‌టుడూ ఆశ‌యంగా పెట్టుకుంటారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుగా వెలుగొందుతోంది.. ఆస్కార్ అవార్డు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ న‌గ‌రంలో ఏటా జ‌రిగే అవార్డుల ఫంక్ష‌న్ న‌భూతో న‌భవిష్య‌తి రీతిలో జ‌రుగుతుంటోంది.

ఆ ఏడాదికి ప్ర‌పంచ చ‌ల‌న‌చిత్ర రంగంలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, సంగీత ద‌ర్శ‌కులు, త‌దిత‌రుల‌కు ఆస్కార్ అవార్డులు ప్ర‌దానం చేస్తుంటారు. ఎక్కువ‌గా హాలీవుడ్ మూవీసే అవార్డులు కొల్ల‌గొడుతున్నా విదేశీ చిత్రాలు కూడా అప్పుడ‌ప్పుడు త‌మ ఉనికిని చాటుకుంటున్నాయి. మ‌న‌దేశం నుంచి భాను అత‌యా, ఎఆర్ రెహ్మాన్, ర‌సూల్ పుకుట్జి త‌దిత‌రులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. ఎఆర్ రెహ్మాన్ రెండుసార్లు ఆస్కార్ కొల్ల‌గొట్ట‌డం విశేషం.

ఇప్పుడు తాజాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం, సూర్య హీరోగా వ‌చ్చిన ఆకాశ‌మే హ‌ద్దు రా సినిమాలు ఆస్కార్ బ‌రిలో ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆస్కార్ అవార్డు అందుకున్న‌వారికి ఒక బ్లాక్ మెన్ ఉన్న‌ న‌ల్ల‌టి ప్ర‌తిమ‌ను అవార్డుగా అంద‌జేస్తారు. ఆ బ్లాక్ మెన్‌ న‌గ్నంగా ఉండ‌టం విశేషం. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ మెన్‌ ఎందుకు న‌గ్నంగా ఉంటుంద‌నేది ఎవ‌రికీ తెలియ‌దు. దీని వెనుక ఉన్న క‌థ ఏమిటంటే..

ఆస్కార్ ప్రతిమ కాంస్యంతో తయార‌వుతుంది. ఆ తర్వాత దానికి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ ప్రతిమ పదమూడున్నర అంగుళాల ఎత్తు.. ఎనిమిదిన్నర పౌండ్ల బరువు ఉండేలా రూపొందిస్తారు. అలాగే దీనికి ఐదు స్పోక్స్ ఉంచుతారు. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను (నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలు) ఇవి ప్ర‌తిఫ‌లించేలా చూస్తారు.

కాగా ఆస్కార్ ప్రతిమ న‌లుపు రంగంలో ఉంటుంది. అందులోనూ దానిపైన ఉండే మెన్‌ నగ్నంగా ఉంటాడు. ఈ ఆస్కార్ ప్ర‌తిమ‌ను ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ రూపొందించారు. ఆయన ఆస్కార్ అవార్డును డిజైన్ చేసే సమయంలో ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి.. ఆ ఆకారం నుంచి ఈ ప్రతిమను డిజైన్ చేశార‌ని ఆస్కార్ అవార్డుల చ‌రిత్ర చెబుతోంది. ప్రతిమ నమూనా రూపొందాక దానికనుగుణంగా త్రీ డైమెన్షన్స్‌ ప్రతిమను తయారు చేసే పనిని లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ప్రసిద్ధ శిల్పి జార్జ్‌ స్టాన్లీ భుజానికెత్తుకున్నాడు.

కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన.. 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల (450 గ్రాములపైగా) బరువున్న ఆస్కార్‌ ప్రతిమ స్టాన్లీ చేతుల్లో పురుడు పోసుకుంది. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. కాగా మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 1929లో అమెరికాలో జ‌రిగింది.

'ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ.. ఆస్కార్ అవార్డులు అంద‌జేస్తోంది. ఆస్కార్‌ ప్రతిమ.. కాంతులీనే పసిడి వర్ణంతో, ఓ యోధుడు న‌గ్నంగా రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్‌ రీలుపై ఠీవిగా నిల్చొన్నట్టు కనిపిస్తుంది.

కాగా ఒక్కో ఆస్కార్‌ ప్రతిమ తయారీకి సుమారు 1000 డాలర్లకుపైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అలాగే ఈ పురస్కారాలకు ఆస్కార్‌ అని పేరు రావడం వెనక ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. తొలిసారి ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మార్గరెట్‌ హెర్రిక్‌.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్‌ ఆస్కార్‌లా ఉన్నాడని చెప్పింద‌ట. ఆ తర్వాత హాలీవుడ్‌ కాలమిస్ట్‌ సిడ్నీ స్కోల్‌స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్‌ పురస్కారాలని పేర్కొన్నాడు. అలా 'ఆస్కార్‌' వాడుకలోకి వచ్చింది.