Begin typing your search above and press return to search.

బోయ‌పాటి శ్రీ‌ను - బ‌న్నీ మూవీ ఇంట్రెస్టింగ్ డిటైల్స్‌

By:  Tupaki Desk   |   4 Jan 2022 9:00 AM IST
బోయ‌పాటి శ్రీ‌ను - బ‌న్నీ మూవీ ఇంట్రెస్టింగ్ డిటైల్స్‌
X
ఇప్ప‌టి వ‌ర‌కు చేయని రేర్ ఫీట్ కి అల్లు అర్జున్ రెడీ అయిపోతున్నాడా? అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. బ‌న్నీ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప :ది రైజ్‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఉత్త‌రాదిలో ఈ మూవీ 50 కోట్ల మార్కుని ఈజీగా దాటేయ‌డం ట్రేడ్ పండితుల్ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

త్వ‌ర‌లో పార్ట్ 2 రానున్న నేప‌థ్యంలో బ‌న్నీ త‌దుప‌రి చిత్రాల‌కు సంబంధించిన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. `పుష్ప‌`తో పాన్ ఇండియా రేంజ్‌లో త‌న స‌త్తా చాటుకుంటున్న బ‌న్నీ ఆ త‌రువాత కొర‌టాల శివ‌తో పాన్ ఇండియాకు మించి అనే స్థాయి మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అప్ డేట్ ఇంత వ‌ర‌కు రాలేదు. కానీ ఈ మూవీతో పాటు బ‌న్నీ మ‌రో క్రేజీ డైరెక్ట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అత‌నే బోయ‌పాటి శ్రీ‌ను. రీసెంట్ గా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో `అఖండ‌` చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 2న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ పేరుకు త‌గ్గ‌ట్టే అఖండమైన విజ‌యాన్ని సాధించి వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసింది. స్టిల్ ఇప్ప‌టికీ త‌న స‌త్తాను చాటుతూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఈ సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన బోయ‌పాటి శ్రీ‌ను త్వ‌ర‌లో బ‌న్నీతో ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ మూవీని చేయ‌బోతున్నార‌ట‌.

ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప‌క్కా ఎమోష‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈమూవీలో బ‌న్నీ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ త‌న కెరీర్‌లో ద్విపాత్రాభిన‌యం చేయ‌లేదు. ఇలా చేయ‌డం అత‌ని కెరీర్‌లో రేర్ ఫీట్‌. గతంలో బోయ‌పాటి శ్రీ‌ను - బ‌న్నీ ల‌క‌ల‌యిక‌లో `స‌రైనోడు` వంటి ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ రూపొందిన విష‌యం తెలిసిందే. దీనికి మించి త‌మ కాంబినేష‌న్ లో రానున్న సినిమా వుండేలా బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నార‌ట‌.