Begin typing your search above and press return to search.

మహేష్‌.. త్రివిక్రమ్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   1 Jun 2021 8:38 AM IST
మహేష్‌.. త్రివిక్రమ్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ ఖలేజా తర్వాత చేయబోతున్న సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. అతడు.. ఖలేజా చిత్రాల తర్వాత వీరి కాంబో మూవీ కోసం అభిమానులు ప్రేక్షకులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ సెట్‌ అయ్యింది. ఎన్టీఆర్‌ తో చేయాల్సిన మూవీ క్యాన్సిల్‌ అవ్వడంతో మహేష్‌ బాబుతో సినిమాను త్రివిక్రమ్‌ మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల కాస్త ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ మందకోడిగా సాగుతుంది. కాని షూటింగ్‌ మాత్రం సాధ్యం అయినంత త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే సంగీత దర్శకుడి గురించి ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్‌ వినిపిస్తుంది.

ఈమద్య కాలంలో త్రివిక్రమ్‌ కు థమన్ ఆస్థాన సంగీత దర్శకుడు అయ్యాడు. త్వరలో చేయబోతున్న మహేష్‌ బాబు 28వ సినిమాకు కూడా థమన్‌ ను ఎంపిక చేయడం జరిగిందట. ఇప్పటికే మహేష్ బాబు 27వ సినిమా సర్కారు వారి పాటకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆ వెంటనే థమన్‌ సంగీత సారథ్యంలో త్రివిక్రమ్‌.. మహేష్‌ మూవీ రాబోతుంది. అల వైకుంఠపురంలో సినిమా ఆల్బమ్‌ సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో టాలీవుడ్‌ లో టాప్ మ్యూజిక్‌ కంపోజర్‌ గా థమన్‌ నిలిచాడు. అందుకే ఆయన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది.

త్రివిక్రమ్‌ చాలా కాలం తర్వాత మహేష్‌ బాబుతో వర్క్‌ చేయబోతున్నా కూడా అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఇప్పటికి టీవీలో టెలికాస్ట్‌ అవుతూ వీరి కాంబోలో మళ్లీ సినిమా వస్తే బాగుండు అన్నట్లుగా ప్రేక్షకులు ఎప్పుడు అనుకుంటూనే ఉన్నారు. అందుకే సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ల కాంబో మూవీ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అల వైకుంఠపురంలో వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్‌ సినిమా ఇదే కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి మాటల మాంత్రికుడు ఈ అంచనాలను ఎంత మేరకు అందుకుంటాడు అనేది చూడాలి.