Begin typing your search above and press return to search.

`పుష్ప‌`కు వ‌రుణుడి అంత‌రాయం ఇంత‌లోనే..!

By:  Tupaki Desk   |   13 Sep 2021 2:30 AM GMT
`పుష్ప‌`కు వ‌రుణుడి అంత‌రాయం ఇంత‌లోనే..!
X
అల్లు అర్జున్ హీరోగా `పుష్ప` చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్. అనసూయ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఇందులో విలన్ పాత్రలో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. పుష్ప కథ ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ కం స్మగ్లర్ పాత్రలో కనిపిస్తాడు. పుష్ప రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి భాగం క్రిస్మస్ 2021 కి విడుదల అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తున్నారు. షూటింగుకి ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కూడ‌ద‌ని భావించి ప‌ని చేస్తున్నారు. చివరి షెడ్యూల్ మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరగాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా షూటింగ్ వాయిదా పడిందని తెలిసింది.

గోదారి ప‌రిస‌రాల్లోని మారేడుమిల్లి అడవిలో సుదీర్ఘ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. అక్కడ మొదటి షెడ్యూల్ కూడా చిత్రీకరించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా టీమ్ ఇప్పుడు షూటింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. గత రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో మునిగిపోతున్నాయి. మేకర్స్ ఆ లొకేషన్ వదిలి కాకినాడలో షూటింగ్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ బయలుదేరుతున్నప్పుడు అతని వాహనం చుట్టూ భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. అతను తన వాహనం నుండి వారి వైపు కదిలాడు. ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.