Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ 2 కోసం అంత‌ర్జాతీయ మ‌ల్ల యోధుడు ఆగ‌లేడ‌ట‌!

By:  Tupaki Desk   |   16 Feb 2021 10:30 AM GMT
కేజీఎఫ్ 2 కోసం అంత‌ర్జాతీయ మ‌ల్ల యోధుడు ఆగ‌లేడ‌ట‌!
X
ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్ గా వ‌చ్చి సంచ‌ల‌నాలు సృష్టించింది కేజీఎఫ్ చాప్ట‌ర్ 1. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా క‌న్న‌డ ఇండ‌స్ట్రీ స‌హా బాలీవుడ్ ని షేక్ చేసింది. తెలుగు-త‌మిళంలోనూ చ‌క్క‌ని ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. స‌క్సెస్ మాట అటుంచితే ఈ చిత్రంలో న‌టించిన య‌ష్.. ప్ర‌శాంత్ నీల్ ల పేర్లు జాతీయ స్థాయిలో మార్మోగాయి. హోంబ‌లే సంస్థ గౌర‌వం అసాధార‌ణంగా పెరిగింది.

కేజీఎఫ్ కి దేశ విదేశాల్లో వీరాభిమానులున్నారు. అటు క్రీడారంగంలోనూ ఈ సినిమాని అభిమానించిన వాళ్లు ఎక్కువ‌. కెజిఎఫ్ చాప్టర్ 1 వీక్షించిన ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ మ‌ల్ల యోధుడు విల్లీ మాక్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్రో-రెజ్లర్ విల్లీ మాక్ తన ట్విట్టర్ వాల్ పై `కెజిఎఫ్ చాప్టర్ 1` అంటే ఎన‌లేని ప్రేమ అని..కెజిఎఫ్ 2 వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడ‌లేన‌ని వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ సీక్వెల్ టీజర్ నుండి GIF చిత్రాన్ని కూడా జోడించాడు.

కేజీఎఫ్ చాప్టర్ 1 హద్దులు చెరిపేసి ఆద‌ర‌ణ పొందింది. ఇప్పుడు సీక్వెల్ కోసం అంతే ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు అభిమానులు. ఇటు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనూ ఈ సీక్వెల్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కేజీఎఫ్ 2 టీజర్ భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ సీజ‌న్ లో రానున్న‌ పాన్-ఇండియన్ సినిమాల్లో కేజీఎఫ్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుని పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ తో పోటీప‌డుతూ ధీటైన వ‌సూళ్ల‌ను సాధించే స‌త్తా ఉన్న చిత్ర‌మిద‌న్న ప్ర‌చారం కూడా ఇప్ప‌టికే మొద‌లైంది.