Begin typing your search above and press return to search.

సాహో పాట కోసం ఇంటర్నేషనల్ మోడల్

By:  Tupaki Desk   |   16 Dec 2018 5:50 AM GMT
సాహో పాట కోసం ఇంటర్నేషనల్ మోడల్
X
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'సాహో' ఏ రేంజ్ లో ఉండబోతోందనేది 'షేడ్స్ అఫ్ సాహో: చాప్టర్ 1' ద్వారా అందరికీ తెలిసిపోయింది. ఆ రేంజ్ సినిమా కాబట్టే షూటింగ్ కు ఎక్కువ సమయం తీసుకుంటోందని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే ఈ సినిమా లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో పాటుగా పులువూరు బాలీవుడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం ఇంటర్నేషనల్ బ్యూటీ ని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఒక గ్లోబల్ బ్యూటీ తో సాంగ్ ప్లాన్ చేస్తే ఇంటర్నేషనల్ అప్పీల్ వస్తుందని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆ సుందరి కోసం సెర్చింగ్ సాగుతోందట. త్వరలో ఈ బ్యూటీ కి సంబందించిన వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

ఇప్పటికే 'సాహో' పై క్రేజ్ భారీ గా ఉంది. ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్స్ కూడా జోడిస్తే అంచనాలను మరింతగా పెరగడం ఖాయమే. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 15 న విడుదల కానుంది.