Begin typing your search above and press return to search.

విక్కీ-క్యాట్ ని బెదిరించింది ఇంట‌ర్మీడియ‌ట్ కుర్రాడు!

By:  Tupaki Desk   |   26 July 2022 6:30 AM GMT
విక్కీ-క్యాట్ ని బెదిరించింది ఇంట‌ర్మీడియ‌ట్ కుర్రాడు!
X
బాలీవుడ్ క‌పుల్స్ విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ దంప‌తుల్ని చంపేస్తామంటూ ఇన్ స్టా ద్వారా ఓ బెదిరింపు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. దీంతో స‌ల్మాన్ ఖాన్ ని బెదిరించిన‌ట్లే? ఈ స్టార్ క‌పుల్స్ ని కూడా చంపేస్తామ‌ని బెద‌రించి ఉంటార‌ని భావించిన ముంబై పోలీసులు వెంట‌నే ఆ జంట‌కి ప్ర‌త్యేక భ‌ద్ర‌త కల్పించి.కేసు న‌మోద చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ముంబై గ్యాగ్ స్ట‌ర్ల నుంచి బెదిరింపు వ‌చ్చి ఉంటుంద‌ని ఆర‌కంగా కేసును విచార‌ణ మొద‌లు పెట్టారు. అయితే ఈ జంట‌ని బెదిరించింది గ్యాంగ్ స్టర్లు కాదు. మాఫియా డాన్లు కాదు. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివిన ఓ కుర్రాడ‌ని ముంబై పోలీసులు తేల్చారు. ల‌ఖ‌న్ వూకు చెందిన 25 ఏళ్ల మ‌న్వింద‌ర్ సింగ్ అని పోలీసులు ఆధారాల‌తో బ‌య‌ట పెట్టారు.

మ‌న్వింద‌ర్ సింగ్ సినిమాల్లో అవ‌కాశాల కోసం ల‌ఖ‌న్ వూ నుంచి ముంబైకి వ‌చ్చాడు. గ‌త మూడు నెల‌లుగా స‌బ‌ర్బ‌న్ ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో ప‌లు ప్ర‌దేశాల్లో నివ‌సిస్తున్నాడు. ఖ‌ర్చుల కోసం కుటుంబంపైనే ఆధార‌ప‌డుతున్నాడు. అయితే మ‌న్వింద‌ర్ కొన్ని రోజులుగా వీక్కీ-క్యాట్ ఇంటికి ద‌గ్గ‌ర్లోనే లాడ్జి తీసుకుని ఉంటున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే ఇన్ స్టా గ్రామ్ లో ఇష్టాతీరున పోస్ట్లు పెడుతున్నాడు. ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయేస‌రికి ఏకంగా చంన‌పేస్తానంటూ బెదిరింప సాగాడు. దీంతో ఆ జంట విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎడిట్ చేసిన ఫోటోలు పంచుకుంటూ క‌త్రినాను తాను పెళ్లిచేసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో తెలిపాడు.

ఇద్ద‌రిపై తీవ్ర‌మైన దాడి చేసి చంపేయాల‌నుకుంటున్న‌ట్లుగా వ‌రుస పోస్టు పెడుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇంకా చాలా మంది హీరోయిన్ల విష‌యంలోనూ మ‌న్వింద‌న్ ప్ర‌వ‌ర్త‌న ఇలాగే ఉంద‌ని పోలీసులు గుర్తించారు. దీంతో విక్కీ-క్యాట్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

స‌ల్మాన్ కి గ్యాంగ్ స్టార్ నుంచి ఓ లేఖ రూపంలో వ‌చ్చిన బెదిరింపు నేప‌థ్యంలో ఈ జంట ఆందోళ‌న‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. గ‌తేడాది డిసెంబ‌ర్లో క‌త్రినా-విక్కీ వివాహ బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే.