Begin typing your search above and press return to search.

విజ‌య్ టాలీవుడ్ డెబ్యూపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

By:  Tupaki Desk   |   18 Oct 2022 8:39 AM GMT
విజ‌య్ టాలీవుడ్ డెబ్యూపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
X
కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ క‌థానాయ‌కుడిగా టాలీవుడ్ లో 'వార‌సుడు' చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. వంశీ పైడి ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా పై తెలుగు..త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న యూనిట్ ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్టే ప‌నిలో బిజీ అవుతోంది.

ఈ నేప‌థ్యంలో లిరిక‌ల్ సాంగ్స్ ని రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే మొదటి సింగిల్ ని దీపావళికి కానుక‌గా విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ పాట‌కి సంబంధించి మ‌రింత అప్ డేట్ అందుతోంది. ఆ పాటకు 'రంజితమే ఏ రంజితమే' అనే ట్రాక‌త్ తో సంగీత ప్రియుల ముందుకు తీసుకొస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ పాట‌లో విజ‌య్ కూడా స్వ‌రం క‌లిపిన‌ట్లు తెలుస్తోంది.

పాట మ‌ధ్య‌లో విజ‌య్ త‌న గాత్రాన్ని వినిపించ‌బోతున్నారుట‌. తెలుగు..త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ ఆల‌పించిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి పాట‌ని ఆల‌పించేది జోనితా గాంధీ. ఆమెతో పాటు విజ‌య్ కూడా పాట‌లో భాగ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. పాట ఆద్యంతం శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్ట‌కుంటుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది.

ఈ సినిమాలో థ‌మ‌న్ కంపోజింగ్ వైవిథ్యంగా ఉంటుంద‌ని...త‌న పాత శైలిని విడిచిపెట్టి కొత్త పంథాలో బాణీలు స‌మ‌కూర్చిన‌ట్లు స‌మాచారం. ట్యూన్స్ విష‌యంలో విజ‌య్ కూడా థ‌మ‌న్ పాటు ట్రావెల్ అయిన‌ట్లు వినిపిస్తుంది. ఇటీవ‌లి కాలంలో విజ‌య్ సినిమాలు మ్యూజిక‌ల్ గా మంచి విజ‌యం సాధిస్తున్నాయి. ఈనేప‌థ్యంలో వార‌సుడు సినిమా విష‌యంలో అంతే జాగ్రత్త తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

సినిమాలో విజ‌య్ కి జోడీగా రష్మిక మందన్న న‌టిస్తోంది. ఆమె పాత్రకు న‌ట‌న ప‌రంగా చాలా స్కోప్ ఉంద‌ని వినిపిస్తుంది. తెలుగు డెబ్యూ కావ‌డంతో విజ‌య్ రొమాంటిక్ స‌న్నివేశాల్లో సైతం క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ర‌ష్మిక రొమాంటిక్ స‌న్నివేశాల్లో టాలీవుడ్ లో ఫేమ‌స్ అయింది. మ‌రి విజ‌య్ తో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఇంకా ఈ చిత్రంలో జయసుధ.. ప్రకాష్ రాజ్.. ప్రభు.. శ్రీకాంత్.. యోగి బాబు.. శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కోలీవుడ్ లో పెద్ద ఎత్తున బిజినెస్ జ‌రుగుతున్నట్లు స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.