Begin typing your search above and press return to search.

సమంత వింత ప్రేమ కథపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   22 Feb 2022 8:30 AM GMT
సమంత వింత ప్రేమ కథపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌
X
సమంత పెళ్లి కథ ముగిసింది.. ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. నాగ చైతన్యతో కలిసి ఉన్న సమయంలో సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరించేవారేమో.. చాలా తక్కువ సినిమాలు చేశారు. కాని చైతన్య నుండి బ్రేకప్‌ ప్రకటన వచ్చిన తర్వాత చాలా సినిమాలను ఆమె ప్రకటించారు. చైతూ తో కలిసి ఉన్న సమయంలోనే సమంత చేసిన తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమాలో నయనతార మరియు విజయ్‌ సేతుపతితో కలిసి సమంత స్క్రీన్ షేర్‌ చేసుకుంటుంది. హీరోయిన్ గా ఇప్పటి వరకు సమంత చేసిన పాత్రలకు పూర్తి విభిన్నమైన సినిమా గా దీనిని అనుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా టీజర్‌ వచ్చిన తర్వాత అందరి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. విజయ్ సేతుపతి ఇద్దరిని ప్రేమించడం.. వారిద్దరు విజయ్ సేతుపతిని ప్రేమించడం చాలా సీరియస్ స్టోరీని ఫన్నీగా చూపించబోతున్నట్లుగా టీజర్ ను చూస్తుంటే అనిపిస్తుంది.

ఈ సినిమా కు దర్శకత్వం విఘ్నేష్ శివన్‌ అనే విషయం తెల్సిందే. నయన్ ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్‌ చాలా విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా మొదటి నుండి చెబుతున్నాడు. ఇది ఒక వింత ప్రేమ కథ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక్కరి ప్రేమను ఇద్దరు కోరుకోవడం.. ఒకే వ్యక్తి ఇద్దరి ప్రేమను కోరుకోవడం అనేది అసహజం. ఈ అసహజమైన ప్రేమ కథకు ఎలాంటి మలుపులు ముగింపు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఆసక్తికర సినిమా విడుదల తేదీ విషయమై చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ అధికారిక ప్రకటన ఇచ్చాడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్న సమంత... నయనతార.. విజయ్ సేతు పతి అభిమానులను సంతృప్తి పర్చే విధంగా విడుదల తేదీని విఘ్నేష్‌ శివన్‌ ప్రకటించాడు. ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ఆయన నుండి ప్రకటన వచ్చింది.

విఘ్నేష్ శివన్‌ మరియు నయనతారల మద్య ఉన్న కెమిస్ట్రీ కారణంగా ఖచ్చితంగా సినిమా లో ఆమె పాత్ర హైలైట్‌ అవుతుందేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. కాని టీజర్‌ చూసిన తర్వాత నయన్ పాత్రకు సమంత పాత్ర ఏమాత్రం తగ్గదు అనిపిస్తుంది. వీరిద్దరితో విజయ్ సేతుపతి చేసిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే విషయమై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు తెలుగు డబ్బింగ్‌ విషయమై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. టాలీవుడ్‌ తో పాటు పాన్‌ ఇండియా స్థాయి లో సమంత కు క్రేజ్ ఉన్న కారణంగా సినిమా ను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా విడుదల చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. నయన్ మరియు విజయ్ సేతుపతికి కూడా తెలుగు లో మంచి మార్కెట్‌ ఉంది. కనుక ఈ సినిమా తెలుగు లో విడుదల చేస్తే మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.