Begin typing your search above and press return to search.

RRR నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!

By:  Tupaki Desk   |   30 Oct 2021 8:05 AM GMT
RRR నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!
X
మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న అండ్ టీమ్.. ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ను అందించింది. RRR నుంచి 45 సెకండ్ల గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ స్మాల్ వీడియోని సినీ అభిమానులతో పంచుకోనున్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేసారు. ఇందులో ఇద్దరూ వేర్వేరు దిక్కుల్లో ఇంటెన్స్ గా చూస్తున్నారు. RRR - PVR చేతులు కలుపుతున్న సందర్భంగా నిన్న శుక్రవారమే ఈ గ్లిమ్స్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడంతో అప్డేట్ వాయిదా వేశారు. ఈ క్రమంలో నవంబర్ 1న విడుదల చేస్తునన్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ గ్లిమ్స్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన RRR ప్రచార చిత్రాలు - టీజర్లు - ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల్లో చరణ్ - తారక్ ఆకట్టుకున్నారు. ఇందులో అలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - శ్రియ శరణ్ - సముద్రఖని ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై దానయ్య ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.