Begin typing your search above and press return to search.

హాస్పిటల్ బెడ్ నుంచి ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్

By:  Tupaki Desk   |   11 Aug 2021 10:00 PM IST
హాస్పిటల్ బెడ్ నుంచి ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్
X
సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చెన్నైలో జరిగిన హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో పాల్గొని గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్టుగా ట్విట్టర్ లో తెలిపారు. సర్జరీ కోసం హైదరాబాద్ లోని తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు వచ్చారు. తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చాడు.

తాజాగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ప్రకాష్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశాడు. ‘ది డెవిల్ ఈజ్ బ్యాక్. సర్జరీ విజయవంతం అయ్యింది. నా స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి.. నా కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు.. తొందర్లోనే మళ్లీ యాక్టింగ్ చేస్తా’ అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

ఈ సందర్భంగా హాస్పిటల్ బెడ్ పై నుంచే తీసుకున్న ఫొటోను ప్రకాష్ రాజ్ షేర్ చేశాడు. అందులో ఆయన ఎడమ చేతి భుజంపై గాయమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తండ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తూ గాయపడ్డారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తాజాగా ట్వీట్ చేశాడు.
https://twitter.com/prakashraaj/status/1425433608798363651