Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్‌.. వోడ్కా గ్లాసుకి అమ్మ దీవెన‌లు..!

By:  Tupaki Desk   |   11 March 2022 4:27 AM GMT
ఇంట్రెస్టింగ్‌.. వోడ్కా గ్లాసుకి అమ్మ దీవెన‌లు..!
X
సంఘంలో ఎంద‌రు బోయ్స్ ఉన్నా ఆర్జీవీ లాంటి `బోయ్` లేడు! ఆయ‌న యూనిక్. ఎక్స్ క్లూజివ్..! అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన విచిత్ర వింత‌ విన్యాసాల గురించి ప‌బ్లిసిటీ స్టంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్పుడు పిచ్చి పీక్స్ ప‌రాకాష్ట అంటే ఏంటో చూపించారు మ‌రోసారి.

ఇదిగో ఇలా స్వేచ్ఛ‌గా వోడ్కా సేవిస్తూ అలా అమ్మ దీవెన‌లు అందుకున్నాడు ఆర్జీవీ. వోడ్కా గ్లాసును వ‌ద‌ల్లేదు.. ఆశీర్వాదాన్ని విడిచిపెట్ట‌లేదు. పైగా ఐ యామ్ మై మ‌మ్మాస్ బోయ్ .. ఛీర్స్! అంటూ జోష్ చూపిస్తున్నాడు.

ఎంతైనా ఆర్జీవీ వేరు.. ఆయ‌న ప్ర‌చార శైలి వేరు. గుంపులో ఒక గొర్రెలా ఎప్పుడూ ఉండ‌రు ఆయ‌న‌. గుంపును న‌డిపించే వాడిగా ఉంటాడు. ఇక గాళ్స్ తో ఆయ‌న ఛీర‌ప్ గురించి పెద్ద గ్రంధ‌మే రాయాలి.

మ‌గువ‌ల‌ను థైషోస్ తో ప్ర‌మోట్ చేయ‌డంలో ఆర్జీవీ దిట్ట‌. ఇటీవ‌ల ప‌లువురు హాట్ యాంక‌ర్ల‌ను త‌న‌దైన శైలిలో ప్ర‌మోట్ చేశాడు.

అయితే వాళ్ల‌లో ఎవరైనా ఎప్ప‌టికైనా క‌థానాయిక‌లుగా రాణించ‌గ‌ల‌రా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

యాక్ష‌న్ క్వీన్ కం గ్లామ‌ర్ డాళ్ పూజా బాలేక‌ర్ ని లేడీ బ్రూస్ లీగా చూపిస్తున్న ఆర్జీవీ ఈ సినిమాకి అద్భుత‌మైన బిజినెస్ చేశాడు. ఇండియా చైనాలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.