Begin typing your search above and press return to search.

ఆసక్తిని కలిగిస్తున్న కళ్యాణ్ దేవ్ 'కిన్నెరసాని' టీజర్..!

By:  Tupaki Desk   |   1 Jan 2021 5:23 PM IST
ఆసక్తిని కలిగిస్తున్న కళ్యాణ్ దేవ్ కిన్నెరసాని టీజర్..!
X
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''కిన్నెరసాని''. 'అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్' అనేది దీనికి ఉపశీర్షిక. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేశరాజ్ సాయి తేజ్ కథ - కథనం అందిస్తున్నారు. ఇప్పటికే వైవిధ్యమైన టైటిల్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తాజాగా 'కిన్నెరసాని' టీజర్ ని విడుదల చేశారు.

'కిన్నెరసాని' టీజర్ లో కళ్యాణ్ దేవ్ ఏకాంతంగా ఒక చోట పడుకుని ఆకాశంలోకి తీక్షణంగా చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో 'సూర్యుడికే కనిపించని.. నా గుండెలో చితి మంటని.. ఏ మేఘామో అడగాలని.. ఆశించిన కథ నాదని..' అంటూ మ‌హ‌తి సాగ‌ర్ అందించిన నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజువల్స్ కూడా ఒక మంచి పెయింటింగ్ చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇది కంటెంట్ కి ప్రాధాన్యం ఇస్తూ రూపొందిస్తున్న సినిమా అని అర్థం అవుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.