Begin typing your search above and press return to search.

'రాధేశ్యామ్‌' లవ్‌ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌

By:  Tupaki Desk   |   17 April 2021 3:30 PM GMT
రాధేశ్యామ్‌ లవ్‌ ట్రాక్ ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌
X
ప్రభాస్‌ 'సాహో' చేస్తున్న సమయంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్‌' సినిమా పట్టాలెక్కింది. సాహో విడుదల అయిన వెంటనే రాధేశ్యామ్ ను‌ స్పీడ్ గా పూర్తి విడుదల చేస్తారని అంతా భావించారు. కాని కరోనా మరియు ఇతరత్ర కారణాల వల్ల రాధేశ్యామ్‌ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. జులై నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ఈసారి బలంగా మేకర్స్ కోరుకుంటున్నారు. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా రాధేశ్యామ్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఒక అద్బుతమైన ప్రేమ కావ్యంగా ఉంటుందని మొదటి నుండి మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలోని ప్రేమ కథ సినిమాకు ప్రధాన ఆకర్షణ్‌ అంటున్నారు.

రాధేశ్యామ్‌ లో ఉన్న అంతటి అద్బుతమైన ప్రేమ కథ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా కు సంబంధించిన ఒక లీక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పూజా హెగ్డే డాక్టర్‌ గా కనిపించబోతున్న విషయం ఇప్పటికే తెల్సిందే. ఒక ప్రమాదం కారణంగా పూజా హెగ్డే ఆసుపత్రిలో ప్రభాస్ వచ్చి పడతాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. ఇద్దరి ప్రేమ కు అడ్డు వచ్చింది ఎవరు.. ప్రేమలో కొత్త యాంగిల్ ను దర్శకుడు ఎలా చూపించబోతున్నాడు అనేది సినిమా లో చూస్తే క్లారిటీ వచ్చేయనుంది.

ప్రభాస్‌.. పూజా హెగ్డేల పోస్టర్‌ లు ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలతో పాటు వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్‌ తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎదురు చూపులకు ఖచ్చితంగా ప్రతిఫలం దక్కేలా చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు సౌత్‌ లో అన్ని భాషల్లో మరియు హిందీలో కూడా విడుదల కాబోతుంది. బాహుబలి.. సాహోల వంటి సూపర్‌ హిట్స్ తర్వాత ప్రభాస్‌ నుండి రాబోతున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.