Begin typing your search above and press return to search.

నాగ్ సినిమాలో కాజల్‌ పాత్రపై ఇంట్రెస్టింగ్ గాసిప్‌

By:  Tupaki Desk   |   19 March 2021 11:30 AM GMT
నాగ్ సినిమాలో కాజల్‌ పాత్రపై ఇంట్రెస్టింగ్ గాసిప్‌
X
నాగార్జున మరో రెండు వారాల్లో వైల్డ్‌ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే బంగార్రాజు సినిమాను మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో కూడా నాగార్జున ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే అది అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. నాగ్‌ వైల్డ్‌ డాగ్ తరహాలోనే ప్రవీణ్‌ సత్తారు మూవీ కథ కూడా రా ఏజెంట్‌ మరియు ఆర్మీ చుట్టు తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ అప్‌ డేట్ కోసం అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్‌ లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్‌ నటించబోతుందట. కాజల్ ఈ సినిమా లో రా ఏజెంట్‌ గా కనిపించబోతుందట. మొదటి సారి కాజల్ అగర్వాల్‌ భారీ యాక్షన్‌ సన్నివేశాలను ఈ సినిమా కోసం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్ పలు రకాల గన్స్‌ ను ఎలా వాడాలి ఎలా పట్టుకోవాలి అనే విషయమై వర్క్‌ షాప్‌ లో పాల్గొంటుందట. నాగార్జున మరియు కాజల్ అగర్వాల్ ల కాంబో కోసం అక్కినేని అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.