Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్‌ : దెయ్యంకు లవ్‌ ప్రపోజల్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 10:00 AM IST
ఫస్ట్‌ లుక్‌ : దెయ్యంకు లవ్‌ ప్రపోజల్‌
X
తెలుగమ్మాయి అంజలి ఇక్కడ అంతగా అవకాశాలు దక్కించుకోలేక పోతున్నా గత పదేళ్ల కాలంగా తమిళంలో బిజీ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ఆమె స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌ పాత్రలు చేస్తూ వారితో రొమాన్స్‌ చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తూ తనంతగా తాను స్టార్‌ గా ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అంజలి ప్రస్తుతం 'పూచండి' సినిమాను చేస్తోంది. కృష్ణన్‌ జయరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేశారు.

హర్రర్‌ కామెడీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో అంజలితో పాటు ప్రముఖ కమెడియన్‌ యోగి బాబు కూడా నటిస్తున్నాడు. యోగి బాబు కామెడీ ఈమద్య కాలంలో ప్రతి సినిమాలో కూడా సూపర్‌ హిట్‌ అవుతుంది. దాంతో అంజలి మరియు యోగిబాబుల మద్య కామెడీ సినిమాకు హైలైట్‌ అవుతుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అంజలి దెయ్యంగా కనిపించబోతుండగా ఆమెను ప్రేమించే వ్యక్తిగా యోగి బాబు కనిపించబోతున్నాడు.

ఫస్ట్‌ లుక్‌ లోనే ఆ విషయాన్ని చెప్పకనే చెప్పారు. అంజలి దెయ్యంగా భయంకరమైన ఫోజ్‌ లో ఉండగా వెనుకల నుండి క్యూట్‌ గా యోగి బాబు రోజ్‌ ఇచ్చి ఆమెను ఇంప్రెస్‌ చేయాలని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఫస్ట్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ అయిన అంజలి ఎందుకు దెయ్యంగా మారింది అనేది కథ. ఆసక్తికరమైన అంశాలతో ఈ కథ సాగుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.