Begin typing your search above and press return to search.

'వారి మరణానికి కారణం అదే'.. సీనియర్ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 3:42 AM GMT
వారి మరణానికి కారణం అదే.. సీనియర్ నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు..!
X
ఇటీవల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వర్కౌట్స్ చేస్తూ హర్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

అలానే హిందీ నటులు సిద్ధార్థ్ శుక్లా - రాజు శ్రీవాత్సవ - సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ - బ్రహ్మ స్వరూప్ మిశ్రా వంటి వారు కూడా ఎక్సర్సైజ్ చేస్తూనో లేదా చేసిన నిమిషాల తర్వాతనో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు.

వీరంతా హెవీగా వర్కౌట్స్ చేయడం వల్లనే చనిపోయారని అందరూ భావిస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల ఆకస్మిక మరణాలపై బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి తాజాగా స్పందించారు. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల జిమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని.. అది హార్ట్ ఎటాక్ కాదని అన్నారు.

సునీల్ శెట్టి మాట్లాడుతూ.. బాడీ సహకరించేంత వరకే వారు వర్కౌట్స్ చేశారే తప్ప.. పరిధి దాటి చేసుండరని అన్నారు. వారు తీసుకున్న సప్లిమెంట్స్ - స్టెరాయిడ్స్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు. అంతేకానీ ఎక్కువగా వర్కౌట్ చేయడమనేది దీనికి కారణం కాదని బాలీవుడ్ నటుడు అభిప్రాయపడ్డారు.

స్టెరాయిడ్స్ మరియు సప్లిమెంట్స్ ను అధికంగా తీసుకునే వారికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని.. అది హార్ట్ ఎటాక్ కాదని సునీల్ పేర్కొన్నారు. వర్కౌట్స్ చేసేవారు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం.. తగినంత నిద్ర పోవడం కీలకమని.. ఇవి ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని సునీల్ శెట్టి వివరించారు.

కాగా, బాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ హీరోల్లో ఒకరిగా రాణించిన సునీల్ శెట్టి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నాడు. మంచు విష్ణు "మోసగాళ్ళు" చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హిందీ నటుడు.. వరుణ్ తేజ్ "గని" చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రభాస్ "ప్రాజెక్ట్ K" లోనూ భాగం అవుతున్నారని టాక్.

సునీల్ శెట్టి ఇప్పుడు "ధారవి బ్యాంక్" అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ స్పేస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఈ నెల 18న విడుదల కాబోతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే జిమ్ చేస్తూ సినీ ప్రముఖుల అకాల మరణం చెందడంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆరు పదుల వయసులోనూ ఆయన ఫిట్ గా ఉండటానికి వర్కౌట్స్ చేయడమే కారణమని చెబుతుంటారు.

ఇకపోతే సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి Rx100 రీమేక్ తడప్ తో హీరోగా లాంచ్ అయ్యాడు. అలానే ఆయన కుమార్తె అతియా శెట్టి హీరోయిన్ గా రాణిస్తుంది. కొన్నేళ్లుగా టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగిస్తున్న అథియా.. తండ్రి అంగీకారంతో త్వరలోనే పెళ్ళి చేసుకోబోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.