Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 గురించి కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   18 April 2022 3:28 AM GMT
ఎన్టీఆర్‌30 గురించి కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న కొరటాల శివ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందని స్వయంగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించాడు. ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సమయం ను కేటాయించాడు. ఎన్టీఆర్ మరియు కొరటాల ల కాంబోలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన వార్తలు గత ఏడాది కాలంగా వస్తూనే ఉన్నాయి. సినిమా చిత్రీకరణ అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో త్వరలోనే ఎన్టీఆర్‌ 30 ని మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

తాజాగా ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జూన్ లో షురు చేసే అవకాశాలు ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మీడియా లో వచ్చిన వార్తల అనుసారంగానే ఎన్టీఆర్‌ 30 సినిమా ను జులై లోనే మొదలు పెట్టబోతున్నట్లుగా కొరటాల శివ ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆచార్య సినిమా సూపర్‌ హిట్ అయితే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్‌ జెట్ స్పీడ్ తో చేసే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ కాంబో మూవీ కేవలం మూడు నెలల్లోనే పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఎన్టీఆర్‌ 30 సినిమాను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ 30 ని సుధాకర్ మరియు కళ్యాణ్ రామ్ లు భారీ బడ్జెట్‌ తో నిర్మించబోతున్నారు.