Begin typing your search above and press return to search.

'బ్యాచిలర్‌' గా చైతూ మొదటి స్పీచ్‌ పై ఆసక్తి

By:  Tupaki Desk   |   8 Oct 2021 1:06 PM IST
బ్యాచిలర్‌ గా చైతూ మొదటి స్పీచ్‌ పై ఆసక్తి
X
అక్కినేని హీరో అఖిల్ నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. దసరా సందర్బంగా వచ్చే వారంలో విడుదల కాబోతున్న మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా అంచనాలను మరింతగా పెంచేందుకు గాను చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా రోజులుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున హాజరు అవ్వబోతున్న ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా అక్కినేని నాగ చైతన్య హాజరు అవ్వబోతున్నాడు. అఖిల్ సినిమాకు చైతూ స్పెషల్‌ గెస్ట్‌ గా హాజరు అవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. కాని చైతూ ఇటీవలే తాను సమంత నుండి విడిపోతున్నట్లుగా ప్రకటించాడు. తమ వివాహ బంధంను సుదీర్ఘ చర్చల తర్వాత బ్రేక్‌ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రకటించారు. బిగ్గెస్ట్‌ ఇష్యూ తర్వాత చైతూ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం. మీడియా అడిగే ప్రశ్నలకు చైతూ ఇంట్రాక్ట్‌ అవ్వడు కాని చైతూ ఈ వేడుకలో ఖచ్చితంగా సమంత గురించి మాట్లాడాల్సి వస్తుందేమో అంటూ అంటున్నారు. కాని చైతూ మాత్రం ఆ విషయాలను ప్రస్తావించకుండానే సింపుల్‌ గా తన స్పీచ్ ను ముగిస్తాడేమో అంటున్నారు.

సమంతతో బ్రేకప్ తర్వాత మళ్లీ బ్యాచిలర్ అయిన నాగ చైతన్య తమ్ముడు బ్యాచిలర్‌ మూవీ ప్రిరిలీజ్ వేడుకలో పాల్గొనడం కాకతాళీయం అయినా కూడా అభిమానులు మాత్రం చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ వేడుకలో చైతూ మాట్లాడే విషయం గురించి మీడియా సర్కిల్స్ చర్చించుకుంటున్నాయి. చైతూ ను పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా అభిమానులు కూడా నినాదాలు చేయకుండా ముందే చూసుకోవాలనే అభిప్రాయంతో షో నిర్వాహకులు ఉన్నారు. అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి నాగ చైతన్య ఒక పెద్ద విషయం జీవితంలో జరిగిన తర్వాత మీడియా ముందుకు వచ్చి కనిపించబోతున్న నేపథ్యంలో ఆయన ఎలా ఉన్నాడు.. ఆయన ఫేస్ లో ఇంతకు ముందు ఉన్నంత కాన్ఫిడెన్స్‌ సంతోషం ఉందా అనేది చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. సమంతతో బ్రేకప్ అయినా కూడా చైతూ సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చైతూ బ్యాచిలర్ వేడుకలో యాక్టివ్ గా కనిపిస్తూ అభిమానులు ఊపిరి పీల్చుకుంటారు. సమంత పై కూడా కాస్త ట్రోల్స్ తగ్గుతాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చైతూ ఒక్క పదం అయినా సమంత గురించి మాట్లాడుతాడా అనే విషయం పై అందరిలో కూడా ఆసక్తి కనిపిస్తోంది. చైతూ ఆ విషయం గురించి మాట్లాడినా మాట్లాడకున్నా తాను హ్యాపీగా ఉన్నాను అనే మెసేజ్ ను అభిమానులకు ఇచ్చినా చాలు అంటూ అంతా భావిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అక్కినేని అభిమానుల్లో ఆసక్తిని కలుగజేస్తోంది. చైతూ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే లవ్‌ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నటుడిగా చైతూ కు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో చైతూ పాత్ర చాలా మందికి కనెక్ట్‌ అయ్యేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా హిందీలో ఎంట్రీ ఇవ్వబోతున్న లాల్‌ సింగ్‌ చద్దా కూడా విడుదల అవ్వబోతుంది. నాన్న నాగార్జునతో బంగార్రాజు సినిమా కూడా పట్టాలెక్కింది. త్వరలోనే విడుదల అయ్యేలా ఉంది.