Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్‌: సాయిధరమ్ ఇంటిలిజెంట్

By:  Tupaki Desk   |   22 Jan 2018 5:07 PM IST
ఫస్ట్ లుక్‌: సాయిధరమ్ ఇంటిలిజెంట్
X
మొత్తానికి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఫస్ట్ లుక్ ను ఎట్టకేలకు రిలీజ్ చేశారు. మొన్నామధ్యన 'జవాన్' సినిమాతో పరాజయాన్ని చవిచూసిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఇప్పుడు తన కొత్త సినిమాతో ఎలాగైనా మెగా బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ఇప్పుడు వివి వినాయక్ డైరక్షన్లో 'ఇంటిలిజెంట్' అంటూ దూసుకొస్తున్నాడు. అదిగో ఫిబ్రవరి 9న రిలీజయ్యే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళే రిలీజైంది.

వినాయక్ అంటేనే ఫక్తు కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. అందుకే ఇప్పుడు వినాయక్ దర్శకత్వంలో ఇలా కొత్తగా వస్తున్నాడు సాయిధరమ్. అయితే ఈ సినిమాకు ఇంటిలిజెంట్ అనే టైటిల్ పెట్టినా.. పోస్టర్ మాత్రం ఓ మోస్తరు ఇంటిలిజెంట్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి టైటిల్ చూసినప్పుడు నిజానికి జనాలు ఇంకా ఏదో ఊహించేశారు. అయితో మనోళ్ళు సింపుల్ గా సగం మొహాన్ని ఇంటిలిజెంట్ అనే అక్షరాలతో కవర్ చేసేసి.. కాస్త మ్యాట్రిక్స్ తరహా ఫీల్ తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే సినిమా తీస్తోంది వినాయక్ కాబట్టి.. పోస్టర్ ఎలా ఉన్నా కూడా పైన ఆయన బొమ్మ పడితే చాలు.. రచ్చ లేస్తుంది అంతే.

వినాయక్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గత ఏడాది విన్నర్ అండ్ జవాన్ సినిమాలకు తమనే మ్యూజిక్ అందించాడు కాని.. సాయిధరమ్ కు అది ప్లస్సవ్వలేదు. మరి ఇప్పుడు ఎలా కొట్టాడో చూడాలి. ఈ సినిమాతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి కి కూడా అర్జెంటుగా ఒక హిట్ అవసరం.