Begin typing your search above and press return to search.

జాన్వీ తో ఇన్ స్టా రిక్వెస్ట్..దొంగ‌లు చొర‌బడ్డారా!

By:  Tupaki Desk   |   28 Jan 2022 12:30 AM GMT
జాన్వీ తో ఇన్ స్టా రిక్వెస్ట్..దొంగ‌లు చొర‌బడ్డారా!
X
జాన్వీక‌పూర్ టెంప్టింగ్ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జాన్వీ అందాల విందు వ‌డ్డ‌న‌కి ఎవ‌రైనా ప‌డిపోవాల్సిందే. ఇన్ స్టా వేదిక‌గా బ్యూటీ ఏమాత్రం త‌గ్గేదేలే. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫోటోల‌తో మంట‌లు రేపుతుంది. తాజాగా బ్యూటీ మ‌రోసారి యువ‌త మ‌దిలో మంట‌లు రేపింది. గాలికి వ‌దులుగా వ‌దిలేసిన కురులు.. తెలుపు రంగు ప‌ల‌చ‌టి బ‌నియ‌న్...చిట్టి పొట్టి నిక్క‌రు ధ‌రించి థై అందాల ఎలివేష‌న్ల‌తో కాక‌లు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ షూస్ ధ‌రించి మార్నింగ్ వాక్ లా అలా రోడ్డు పై న‌డుచుకుంటూ వెళ్తోన్న ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

ఈ ఫోటోకి జాన్వీ ఎలాంటి క్యాప్ష‌న్ ఇవ్వ‌లేదు గానీ... లైక్ కామెంట్..సేవ్..షేర్ అంటూ ఇన్ స్టా పేజీ క్రేజ్ ని పెంచుకునే ప్ర‌య‌త్నానాన్ని చూపించింది. `ఫాలో జాన్వీ క‌పూర్` అనేదాన్ని హైలైట్ చేసింది. ప్ర‌స్తుతం సెల‌బ్రిటీల క్రేజ్ ని పెంచేది ఇన్ స్టా పేజీనే.

ఇన్ స్టాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య పెంచుకునేందుకు సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే జాన్వీ ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయలేదు. దీంతో జాన్వీ అకౌంట్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అక‌తాయిలు ఈ ప‌నికి ఒడిగ‌ట్టారా? అన్న‌ది సందేహం.

ఇక జాన్వీ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్లో `దోస్తానా-2` లో న‌టిస్తోంది. అదే బ్యాన‌ర్ లో మ‌రో రెండు చిత్రాలు క‌మిట్ అయింది. అలాగే అమ్మ‌డు న‌టించిన `గుడ్ ల‌క్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది.

`మిలీ` అనే మ‌రో చిత్రంలో కూడా న‌టిస్తుంది. ఇక ద‌క్షిణాదిన ఎంట్రీ ఇవ్వ‌డానికి జాన్వీ ఆస‌క్తిగానే ఉంది. కానీ స‌రైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. త‌ల్లి త‌ర‌హాలోనే అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేయాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది.