Begin typing your search above and press return to search.
నలుగురిని కాపాడిన సోనమ్ సినిమా
By: Tupaki Desk | 6 March 2016 7:19 AM GMTసినిమాలు జనాలను చెడగొట్టేస్తున్నాయ్ అని అంటూ ఉంటారు కానీ.. అవే సినిమాలు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాయ్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 20న డెహ్రాడూన్ లోని ఓ బ్యాంక్ లోకి దుండగుడు చొరబడ్డాడు. హెల్మెట్ పెట్టుకున్న అతడు.. బ్యాంక్ స్టాఫ్ ని పరిశీలించగా.. ముగ్గురు అమ్మాయిలు మాత్రమే కనిపించారు.
అంతే.. నేరుగా క్యాష్ కౌంటర్ లో ఉన్న మిటాలీ షా నుదుటిపై గురి పెట్టి క్యాష్ అంతా బ్యాగ్ లో పెట్టాల్సిందిగా కమాండ్ చేశాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసి, మిగతా ఇద్దరు లేడీ స్టాఫ్ - ఇద్దరు కస్టమర్స్ బిగుసుకుపోయారు. మొదట గన్ చూసి భయపడ్డ మిటాలి, గన్ను తీసేయాల్సిందిగా కోరింది. దీనికి మరింత రెచ్చిపోయిన అతడు.. కాల్చేస్తానని బెదిరించాడు. దీంతో ధైర్యం కూడదీసుకున్నఈ అమ్మాయి.. 'కాల్చుకుంటే కాల్చుకో రూపాయి కూడా ఇవ్వను'అనేసింది. దీంతో మిగతా ఇద్దరిలో ఒక అమ్మాయి ఎమర్జెన్సీ అలారం ప్రెస్ చేసింది. దీంతో అతను భయపడి పారిపోయాడు. పోలీసులు ఇంకా ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ముగ్గురికి టిలు రౌతేలి అవార్డు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఇంతకీ ఇంత ధైర్యం ప్రదర్శించడానికి కారణమేంటి అని మిటాలీ షాని ప్రశ్నిస్తే.. ఆమె ఇచ్చిన సమాధానం.. సోనమ్ కపూర్ నటించి నీర్జా.