Begin typing your search above and press return to search.

‘గీతాగోవిందం’ పాట సూపర్ హిట్

By:  Tupaki Desk   |   18 July 2018 10:49 AM IST
‘గీతాగోవిందం’ పాట సూపర్ హిట్
X
అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీని ఆకర్షించిన నటుడు విజయ్ దేవరకొండ.. ఆచీతూచీ సినిమాలు చేస్తూ బంపర్ హిట్స్ అందుకుంటున్నాడు. అంతేకాదు.. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థల్లో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సారథ్యంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి గీతాగోవిందం..

విజయ్ దేవరకొండ, రష్మికా మందానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ‘గీతాగోవిందం’ మూవీ నుంచి తాజాగా ఓ పాట రిలీజ్ అయ్యి వైరల్ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆసక్తి రేపిన ఈ చిత్రం యూనిట్ తాజాగా సినిమాలోని తొలిపాటను రిలీజ్ చేశారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ పాట.. సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.

‘ఇంకేం.. ఇంకేం కావాలే’ అంటూ మొదలయ్యే ఈ పాట.. యువత మనసులను కొల్లగొడుతోంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడాడు. వీనుల విందైన మెలోడీతో అలరిస్తున్న ఈ పాట సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఈ పాటను కేవలం వారం రోజుల్లోనే చూశారంటే ఎంత మెస్మరైజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూశాక.. ‘గీతాగోవిందం’ మూవీ కూడా విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటున్నారు సినీ పండితులు..