Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ -4 డౌటేనట..త్వరలో క్లారిటీ!!

By:  Tupaki Desk   |   11 July 2020 12:30 AM GMT
బిగ్ బాస్ -4 డౌటేనట..త్వరలో క్లారిటీ!!
X
తెలుగులో టీవీ తెరపై మూడు సీజన్లుగా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో.. ఈ ఏడాది సీజన్ 4తో అలరించనుందట. నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి టైం ఆల్రెడీ దగ్గర పడింది. నిజానికి బిగ్ బాస్ సీజన్ 2017 జూలై 16న ప్రారంభం అయింది. తర్వాత రెండో సీజన్ 2018 జూన్ 10న ప్రారంభం చేశారు. ఇక సీజన్ 3 2019 జూలై 21న మొదలైంది. అయితే ఈసారి సీజన్ 4 కూడా జూన్ నెలలోనే ప్రారంభించాలనే ప్రయత్నాలు చేసినా.. కరోనా కారణంగా జూలై నెలకు జరుపుకోక తప్పులేదు. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించిన అన్ని కసరత్తులు పూర్తి కావడంతో త్వరలో బిగ్ బాస్ సీజన్ 4ని ప్రారంభించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఒకటి హల్చల్ అవుతోంది.

అయితే ఇప్పటి వరకూ బిగ్ బాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లీక్‌లు కాని బయటకు రాకపోవడంతో ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని స్పష్టం అవుతోంది. ఈ నాలుగో సీసన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్నాడు. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో కరోనా విజృంభన మాములుగా లేదు. రోజురోజుకి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. నాగార్జున ప్రస్తుతం భయపడుతున్నాడట. ఇదిలా ఉండగా బిగ్ బాస్ టీమ్ ప్రస్తుతం షో ప్రారంభించే ఆలోచనలో లేనట్లు సమాచారం. ఇప్పటికే కరోనా కారణంగా నాగార్జున తన వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కాన్సల్ చేసుకున్నాడు. అయితే ఈ నెలాఖరు లోపల వాతావరణం పరిశీలించి ఫైనల్ డెసిషన్ చెప్తారని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈసారి బిగ్ బాస్ ఉందో లేదో.. అందుకోసం ప్రత్యేక సెట్ వేయాల్సి ఉంటుందని విషయం తెలిసిందే.