Begin typing your search above and press return to search.

ఆ ట్రైలర్ కు 24 గంటల్లో 2.3 కోట్ల వ్యూస్

By:  Tupaki Desk   |   3 Dec 2017 9:30 AM GMT
ఆ ట్రైలర్ కు 24 గంటల్లో 2.3 కోట్ల వ్యూస్
X
24 గంటల్లో 2 మిలియన్ వ్యూస్.. 3 మిలియన్ వ్యూస్.. 5 మిలియన్ వ్యూస్ అంటూ.. మన సినిమాలకు యూట్యూబ్‌ లో వచ్చే హిట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఐతే ఒక సినిమా ట్రైలర్ కు 24 గంటల్లో ఏకంగా 2.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని చిత్రమిది. మార్వెల్ స్టూడియోస్ సంస్థ నాలుగు రోజుల కిందటే ‘ఎవెంజర్స్.. ఇన్ఫినిటీ వార్’ ట్రైలర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

‘ఎవెంజర్స్’ సిరీస్‌ లో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తికి తగ్గట్లే ఈ ట్రైలర్ కు కళ్లు చెదిరే రీతిలో వ్యూస్ వస్తున్నాయి. 24 గంటల్లోనే ఈ ట్రైలర్ కు 2.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది ఈ ట్రైలర్ చూశారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

హలీవుడ్లో తెరకెక్కే సూపర్ హీరో సినిమాల మీద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క సూపర్ హీరో తెర మీద కనిపిస్తేనే జనాల ఎగ్జైట్మెంట్ ఒక లెవెల్లో ఉంటుంది. ‘ఎవెంజర్స్’లో స్పైడర్ మ్యాన్.. ఐరన్ మ్యాన్.. హల్క్.. థోర్ లాంటి నలుగురైదుగురు సూపర్ హీరోలుంటారు. ఈ సిరీస్‌ లో వచ్చిన కొత్త సినిమా ‘ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.