Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ గుస‌గుస‌.. క‌త్రిన కైప్ గ‌ర్భిణి

By:  Tupaki Desk   |   13 April 2022 9:32 AM GMT
ఇండ‌స్ట్రీ గుస‌గుస‌.. క‌త్రిన కైప్ గ‌ర్భిణి
X
కత్రినా కైఫ్ ఇటీవ‌లే త‌న ప్రియుడు విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడి సంసార బంధంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే క‌త్రిన గ‌ర్భిణి అంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. తాజాగా తన పబ్లిక్ అప్పియరెన్స్ అందుకు ఊత‌మిచ్చింది. అందాల క‌త్రిన గత రాత్రి విమానాశ్రయంలో సంప్రదాయబ‌ద్ధ‌మైన‌ అవతార్ లో కనిపించింది. ఈ లుక్ విష‌య‌మై నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంది. అదే స‌మ‌యంలో గ‌ర్భం ధ‌రించిందా? అంటూ నెటిజ‌నులు ప్ర‌శ్నించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి క‌త్రిన‌ ఫ్యాషన్ సెన్స్ ఎల్లప్పుడూ ఎంతో ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. క్యాట్ రెడ్ కార్పెట్ ప్రదర్శనలు.. ఔటింగులు.. బికినీ బీచ్ షికార్లు.. విమానాశ్రయం లుక్స్ ఏవైనా కావచ్చు.. ప్ర‌తిసారీ త‌ల‌లు తిప్పి త‌నే చూడాలి! అన్నంత‌గా సెల‌క్టివ్ గా ఉంటుంది.

నెటిజనులు గత రాత్రి నుండి కత్రినా షేర్ చేసిన‌ వీడియోపై ప్రతిస్పందిస్తున్నారు. ఆమె గర్భవతి క‌దా! అంటూ ప‌లువురు ఆశ్చర్యపోతున్నారు. కత్రినా పింక్ అండ్ వైట్ సల్వార్-కమీజ్ ని ధరించి ఎప్పటిలాగే చాలా అందంగా కనిపించింది. ఆమె తన వేషధారణకు సన్ గ్లాసెస్ యూనిక్ నెస్ ని తెచ్చాయ‌ని చెప్పాలి. కత్రినా కైఫ్ సౌకర్యవంతమైన విమానాశ్రయం లుక్ ఇంటర్నెట్ లో ప్రశంస‌లు అందుకుంటోంది. వైర‌ల్ గానూ షేర్ అవుతోంది.

ఆమె వీడియోకు ప్రతిస్పందిస్తూ ఇన్ స్టాలో ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. "క‌త్రిన గర్భిణీ?" అని రాసారు. మరొక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. "ఇంత తొందరగా ఏమీ చెప్పలేను కానీ వారు ఖచ్చితంగా ఆ ప‌నిలోనే ఉన్నారు.. రెండు వారాల క్రితం శృంగార సెలవుదినం కూడా గడిపారు.. వేచి ఉండలేం" అని అన్నారు.

మూడవ వినియోగదారు ఇలా వ్యాఖ్యానించాడు. "ఆమె రూపాన్ని బట్టి కాదు...ఆమె బలహీనమైన నడకను బట్టి...నేను అలా భావించాను....ప్రారంభ దశలో అది చాలా బలహీనంగా ఉంటుందని…" అంటూ కామెంట్ చేశాడు. ఓవ‌రాల్ గా క‌త్రిన ఫ్రెగ్నెన్సీ పై డిబేట్ వాడి వేడిగా ర‌న్ అయ్యింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కత్రినా కైఫ్ ప్రస్తుతం 'టైగర్ 3' షూటింగ్ లో ఉంది. క‌త్రిన కొంత‌ ఆలస్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులకు తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని తరచుగా తెలియజేస్తుంది. తాజా ఊహాగానాలు నిజ‌మైతే కత్రిన కూడా మామ్ అయిపోతుంద‌న్న‌మాట‌.