Begin typing your search above and press return to search.

సంక్రాంతికి HOUSE FULL బోర్డులు కనిపిస్తే అంతేగా!

By:  Tupaki Desk   |   19 Nov 2020 2:30 AM GMT
సంక్రాంతికి HOUSE FULL బోర్డులు కనిపిస్తే అంతేగా!
X
స‌మ్మ‌ర్ లేదు.. ద‌స‌రా లేదు .. దీపావ‌ళికి ఛాన్స్‌ లేదు.. ఇక 2020లో మిగిలింది క్రిస్మ‌స్ ఒక్క‌టే. క‌నీసం ఈ పండ‌క్కి అయినా థియేట‌ర్లు తెరుస్తారా? లేదూ డైరెక్టుగా సంక్రాంతికే ఓపెన్ చేస్తారా? ఇదీ ఇప్ప‌టి చ‌ర్చ‌. కోవిడ్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తించినా స్వ‌చ్ఛందంగానే థియేట‌ర్ ఓన‌ర్లు హాళ్ల‌ను తెరిచేందుకు ఆసక్తిగా లేరు. ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తించినా ఎగ్జ‌బిట‌ర్లు థియేట‌ర్లు తెర‌వ‌లేదు.

తెలంగాణ‌లో అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. ఒక‌వేళ ఇక్క‌డా ప్ర‌భుత్వం ఓకే చెబితే థియేట‌ర్లు తెరుస్తారా లేదా? అన్న సందిగ్ధ‌తా నెల‌కొంది. క‌నీసం వీళ్లంతా క్రిస్మ‌స్ నాటికి అయినా థియేట‌ర్లు తెరిచే ధైర్యం చేస్తారా? అంటే అది కూడా ప్ర‌శ్నార్థ‌కంగానే క‌నిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లపై స్పష్టత లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. డిసెంబర్ 11 నుండి థియేటర్లు ప్రారంభమవుతాయని ఇండ‌స్ట్రీ సోర్స్ చెబుతోంది. క్రిస్ మస్ ‌కు కొన్ని వారాల ముందు థియేటర్లు తెరుస్తారు. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడానికి OTT విడుదలను ఎంచుకున్న సినిమాలు ప్రదర్శించ‌నున్నార‌ట‌.

సాయి తేజ్ న‌టించిన సోలో బ్రతుకే సో బెటర్ క్రిస్మస్ వారాంతంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మహమ్మారి తరువాత థియేటర్లలో విడుదలయ్యే మొదటి ముఖ్యమైన తెలుగు చిత్రం ఇది. అప్పటికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం అలవాటు చేసుకోవటానికి సినిమా విడుదలకు ముందుగానే థియేటర్లు తెరిచి హ‌డావుడి చేస్తార‌ట‌.

సోలో బ్రతుకే సో బెటర్ మంచి ఆదరణ పొందినట్లయితే పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాలతో లాబీయింగ్ ప్రారంభిస్తారు. సంక్రాంతి నాటికి ఆక్యుపెన్సీని కనీసం 75 శాతానికి పెంచమ‌ని అడిగే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పండుగ సీజన్ ‌ను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. రాబోయే రోజుల్లో పరిశ్రమ లో సంక్షోభ నివార‌ణ కోసం ఇంకా ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తారో చూడాలి. ఇంత‌కీ జ‌నాల్లో క‌రోనా భ‌యాలు పోయేది ఎప్ప‌టికో!!