Begin typing your search above and press return to search.

ఫస్ట్‌ లుక్ : సూపర్ ఉమెన్‌ 'ఇంద్రాణి' సూపర్‌ విలన్ ఇదుగో

By:  Tupaki Desk   |   10 April 2022 1:01 PM GMT
ఫస్ట్‌ లుక్ : సూపర్ ఉమెన్‌ ఇంద్రాణి సూపర్‌ విలన్ ఇదుగో
X
ఇండియాస్ ఫస్ట్‌ సూపర్‌ ఉమెన్ మూవీగా రూపొందుతున్న ఇంద్రాణి సినిమాలో కబీర్ దుహాన్ సింగ్ విలన్ గా కనిపించబోతున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా షూటింగ్‌ చకచక జరుగుతున్న ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాలోని సూపర్‌ విలన్ దుహన్ సింగ్ పాత్ర ను రివీల్ చేస్తూ ఈ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

సూపర్ విలన్ ఎలక్ట్రో మ్యాన్‌ గా కబీర్‌ దుహన్ సింగ్‌ అంటూ శ్రీరామ నవమి స్పెషల్‌ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. తెలుగు లో రూపొందుతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా పై అంచనాలు పెంచే విధంగా ఈ సూపర్ విలన్‌ ఎలక్ట్రో మ్యాన్ లుక్‌ ఉందంటూ సోషల్‌ మీడియాలో టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్‌ సినిమాలోని విలన్‌ మాదిరిగా ఇందులో కబీర్ దుహన్ సింగ్‌ కనిపిస్తున్నాడు.

ఖచ్చితంగా ఈ ఇంద్రాణి సినిమా ప్రతి ఒక్క సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్ ను చూసి ప్రతి ఒక్కరు భావించారు. ఇప్పుడు సూపర్‌ విలన్‌ పోస్టర్‌ ను చూస్తే సినిమా పై మరింతగా అంచనాలు కలుగుతున్నాయి.. ఒక హాలీవుడ్‌ సూపర్ మ్యాన్‌.. సూపర్ ఉమెన్ సినిమా ల తరహాలోనే ఇంద్రాణి ఉండబోతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఈ సినిమాకు కథ.. స్క్రీన్‌ ప్లే.. మరియు దర్శకత్వం ను స్టీఫెన్ అందిస్తున్నాడు. సినిమాలో కీలక పాత్రల్లో యానిమా భరద్వాజ్‌.. కబీర్‌ సింగ్‌.. ప్రణిత జిజిన.. గరీమా కౌశల్ ఇంకా షతఫ్‌ అహ్మద్‌ లు నటిస్తున్నారు. భారీగా గ్రాఫిక్స్ తో పాటు ఆకట్టుకునే విజువల్స్ ను ఈ సినిమాలో చూడవచ్చు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మార్చిలో పట్టాలెక్కిన ఈ సినిమా ను ఇదే ఏడాది చివరి వరకు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నాడు.

దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఇంద్రాణి విడుదల అయిన తర్వాత ఖచ్చితంగా సూపర్‌ ఉమెన్‌ సినిమా ల గురించి మాట్లాడుకుంటారు. ఇది పక్కా మాస్ ఎంటర్‌ టైనర్‌ మూవీ. అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా తెలియజేశాడు.