Begin typing your search above and press return to search.

ఆమె అంటే ఆ దర్శకుడికి ఎంత అభిమానమో

By:  Tupaki Desk   |   30 Jan 2017 9:28 AM
ఆమె అంటే ఆ దర్శకుడికి ఎంత అభిమానమో
X
కొందరు దర్శకులకు కొందరు హీరోయిన్లలో కంఫర్ట్ ఉంటుంది. వాళ్ల నటన నచ్చవచ్చు.. వాళ్లతో సౌకర్యంగా అనిపించవచ్చు. అలా సమన్వయం కుదిరిన హీరోయిన్లకు వరుసగా అవకాశాలిస్తారు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణకు కూడా అలాంటి ఫేవరెట్ హీరోయిన్ ఒకరున్నారు. ఆమే ఈషా. ఈ తెలుగమ్మాయిని ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు ఇంద్రగంటి.

గ్లామర్ పరంగా యావరేజ్ మార్కులు పడ్డా.. ఈషా నటనకు మంచి పేరే వచ్చింది ఆ సినిమాతో. ఆ తర్వాత ఇంద్రగంటి తర్వాతి సినిమా ‘బందిపోటు’లోనూ ఆమే హీరోయిన్. కానీ ఈ సినిమా ఆడలేదు. ఈషాకు చెప్పుకోదగ్గ వేరే అవకాశాలేమీ రాలేదు. దీంతో ఆమె ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయినట్లే కనిపించింది. కానీ ఈషా గాడ్ ఫాదరే ఇప్పుడు మళ్లీ ఆమెకో ఛాన్స్ ఇస్తున్నాడు.

‘జెంటిల్ మన్’తో సక్సెస్ అందుకున్న ఇంద్రగంటి తన తర్వాతి సినిమాను అక్కినేని నాగచైతన్యతో చేయాలనుకున్నాడు. కానీ కుదర్లేదు. తర్వాత అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ కాంబినేషన్లో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో ఒక కథానాయికగా ఈషాను ఎంచుకున్నాడు ఇంద్రగంటి. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బేనర్ మీద కె.సి.నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/