Begin typing your search above and press return to search.

అప్పుడు ఫ‌ట్‌.. ఇప్పుడు హిట్

By:  Tupaki Desk   |   18 Jun 2016 5:30 PM GMT
అప్పుడు ఫ‌ట్‌.. ఇప్పుడు హిట్
X
క్లాస్ చిత్రాలు తీయ‌డంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌కి మంచి పేరుంది. 'అష్టాచ‌మ్మా' - 'గోల్కొండ హై స్కూల్‌' - 'అంత‌కు ముందు ఆ త‌రువాత' చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ ను సంపాదించుకున్నాడు. అల్లరి నరేష్ తో తీసిన చిత్రం 'బందిపోటు' పెద్ద షాక్‌ నే ఇచ్చింది. అయితే తాజా చిత్రం 'జెంటిల్ మ‌న్'.. హిట్‌ తో పాటు అత‌ని ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభను మ‌రోసారి నిరూపించింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందుతోంది. క్లాస్.. మాస్ అని తేడా లేకుండా సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఓవర్ సీస్ లో అయితే మంచి వసూళ్లనే సాధిస్తోంది.

ఇదిలా ఉంటే ఇంద్ర‌గంటి గ‌త చిత్రం 'బందిపోటు' - తాజాగా విడుదలైన చిత్రం 'జెంటిల్ మ‌న్' రెండు టైటిల్స్ తో గతంలో సూపర్ హిట్ చిత్రాలొచ్చాయి. బందిపోటు చిత్రం స్వర్గీయ ఎన్టీఆర్ ది కాగా... జెండిల్ మన్ ఏమో.. అర్జున్ ది. దీన్ని ప్రముఖ ఏస్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. ఈ రెండు ఎంత భారీ హిట్లో అందరికీ తెలిసిందే. ఈ రెండు టైటిల్స్ ను ఇంద్రగంటి తన చిత్రాలకు ఉపయోగించుకున్నాడు. అయితే అల్లరి నరేష్ తో తీసిన 'బందిపోటు' ఫ‌ట్ అయితే.. 'జెంటిల్ మ‌న్' మాత్రం హిట్ అయింది.