Begin typing your search above and press return to search.

ఇక్కడి అమ్మాయిలు తక్కువేం కాదు

By:  Tupaki Desk   |   21 March 2018 11:00 PM IST
ఇక్కడి అమ్మాయిలు తక్కువేం కాదు
X
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు బోలెడంత గుర్తింపు ఉంది. తన సినిమాల్లో చాలా సింపుల్ మాటలతో తెలుగుదనాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడు. అలాగే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అష్టా చెమ్మా మూవీలో స్వాతి.. అమీ తుమీలో ఈషా రెబ్బాలతో లీడ్ హీరోయిన్ లోర్స్ చేయించాడు ఇంద్రగంటి.

గతంతో పోల్చితే నిర్మాణ సంస్థల తీరు కూడా మారుతోందని.. తెలుగు అమ్మాయిలకు లీడ్ రోల్స్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని అంటున్నాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే.. ఇంకా ఏ గ్రేడ్ హీరోల పక్కన ఎంపిక చేయడం లేదని.. ఆ రోజు కూడా వస్తే నిజంగా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చని అంటున్నాడీయన. తను ఇక్కడి అమ్మాయిలతో పాటు.. పరాయి భాషల హీరోయిన్లతో కూడా వర్క్ చేశానన్న ఇంద్రగంటి.. ట్యాలెంట్ లో డిఫరెన్స్ అంతగా కనిపించదని చెబుతున్నాడు. ఇక్కడి అమ్మాయిలు అందం విషయంలో కూడా ఏ మాత్రం తీసిపోరని చెబుతున్నాడు.

అయితే.. తెలుగు అమ్మాయిలకు ఎందుకు అవకాశాలు ఇవ్వరనే విషయాన్ని తాను కూడా పసి గట్టలేకపోయానని చెప్పాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. పరాయి భాషల అమ్మాయిలను తక్కువ చేయకపోయినా.. ఇక్కడి అమ్మాయిలకు ఇంకా తెలుగు సినీ పరిశ్రమ చాలా చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నాడు.ఇకపోతే త్వరలోనే సుధీర్ బాబుతో 'సమ్మోహనం' సినిమా ద్వారా మన ముందుకు వస్తున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ద్వారా అదితి రావ్ హైదారి తెలుగులో తెరంగేట్రం చేస్తోంది.