Begin typing your search above and press return to search.

సుధీర్ కోసం ఇంద్రగంటి ఖరారు చేసిన వెరైటీ టైటిల్ భలే ఉందే..!

By:  Tupaki Desk   |   1 March 2021 4:45 PM IST
సుధీర్ కోసం ఇంద్రగంటి ఖరారు చేసిన వెరైటీ టైటిల్ భలే ఉందే..!
X
హీరో సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం' సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీరి కలయికలో నాని ని కలుపుకొని చేసిన 'వి' సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదు. ఈ క్రమంలో ఇంద్రగంటి - సుధీర్ బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. సుధీర్‌ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ రానుంది. స్టార్ హీరోయిన్లయిన సమంత అక్కినేని - రష్మిక మందన్నా మేనేజర్లు బి.మహేంద్రబాబు - కిరణ్‌ బాలపల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది. సుధీర్ బాబు నటిస్తున్న ఈ 14వ చిత్రానికి ఇంద్రగంటి వెరైటీ టైటిల్ ని ఖరారు చేసారు.

తాజాగా సుధీర్ బాబు సోషల్ మీడియా వేదికగా ఇంద్రగంటితో చేస్తున్న చిత్రానికి ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' అనే టైటిల్ ని పెట్టినట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆ అమ్మాయి గురించి ముందు ముందు చాలా అంటే చాలా చెప్తానని సుధీర్ పేర్కొన్నారు. ఇక ఇంద్రగంటి విషయానికొస్తే 'గ్రహణం' 'మాయాబజార్' 'అష్టాచమ్మా' 'గోల్కొండ హైస్కూల్' 'అంతకుముందు ఆ తర్వాత' 'జెంటిల్ మెన్' 'బందిపోటు' 'అమీతుమీ' 'సమ్మోహనం' 'వి' వంటి టైటిల్స్ తో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఈ క్రమంలో ఇప్పుడు ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' అనే వ్యాక్యాన్ని టైటిల్ గా పెట్టి అందరి దృష్టి పడేలా చేసాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చనున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.