Begin typing your search above and press return to search.

దుస్తులపై కామెంట్ చేసిన నెటిజన్లకు షాకిచ్చిన హాట్ యాంకర్

By:  Tupaki Desk   |   18 April 2020 9:30 PM GMT
దుస్తులపై కామెంట్ చేసిన నెటిజన్లకు షాకిచ్చిన హాట్ యాంకర్
X
కరోనాతో తో ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇక ఎప్పుడూ బిజీగా ఉండే సెలెబ్రెటీలు సైతం ఇంట్లో వంట చేస్తూ ఇంటి పనిచేస్తూ సేదతీరుతున్నారు.

తాజాగా ప్రముఖ యాంకర్, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యత అయిన పద్మా లక్ష్మీ అమెరికన్ టాప్ షెఫ్ రియాలిటీ షోలతో బాగా పాపులర్ అయ్యింది. చైన్నైలో పుట్టిన పద్మా లక్ష్మీ అమెరికాలో స్థిరపడింది. అక్కడ పాపులర్ అయ్యింది.

అమెరికాలో టాప్ చెఫ్ ప్రోగ్రాంలను పద్మా లక్ష్మీ చేస్తుంది. ఈమెకు వంటలు బాగా వచ్చు. తాజాగా ఒక వీడియోను షేర్ చేసింది. అందులో స్లీవ్ లెస్ గా చిన్న టాప్ వేసుకొని ఓ ఆహార పదార్థం తయారు చేసింది. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన జనాలు ఆమెపై పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అలా ఎంప్టీగా ఎలా చూపిస్తావని ఆమె వేసుకున్న టాప్ దుస్తులపై ఆడిపోసుకున్నారు. ఈ కామెంట్లకు నొచ్చుకున్న పద్మా లక్ష్మీ తాజాగా మరో వీడియోను షేర్ చేశారు. అందులో తగిన జాగ్రత్తలు తీసుకొని టాప్ ను వేసుకొని వీడియో చేశారు.

ఇక ఈ 2020లో కూడా మహిళ శరీరాన్ని చూస్తూ కామెంట్ చేస్తారా అని నెటిజన్లపై పద్మా లక్ష్మీ అసహనాన్ని వ్యక్తం చేశారు.