Begin typing your search above and press return to search.

ఇండియన్ స్టార్స్.. హాలీవుడ్ డ్రీమ్స్..!

By:  Tupaki Desk   |   9 July 2022 12:30 AM GMT
ఇండియన్ స్టార్స్.. హాలీవుడ్ డ్రీమ్స్..!
X
భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పుడు భాషా ప్రాంతీయత హద్దులు చెరిగిపోయాయి. అందరూ పాన్ ఇండియా చిత్రాలతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నటీనటులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు స్టార్స్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటూ.. హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడని రెడీ అవుతున్నారు.

కోలీవుడ్ హీరో ధనుష్ 'వై థిస్ కొలవెరిడీ' సాంగ్ తో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకున్న విలక్షణ నటుడు.. 2018లో 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్' అనే ఆంగ్ల చిత్రంలో నటించారు. ప్రస్తుతం 'ది గ్రే మ్యాన్' అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ ప్లెక్స్ నిర్మాణంలో దర్శకద్వయం ఆంథోనీ రూసో - జో రూసో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ పాత్ర నిడివి తక్కువైనా.. చాలా కీలకమైనదని తెలుస్తోంది. జులై 22న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు.. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా రెండు మూడు స్ట్రెయిట్ హిందీ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అందం అభినయం కలబోసిన సామ్.. త్వరలో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇందులో ఆమె బైసెక్సువల్ తమిళ యువతి పాత్రల కనిపించనుందని టాక్.

ఇటీవల 'మేజర్' చిత్రంతో సక్సెస్ అందుకున్న తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ.. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించనుంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు హాలీవుడ్ మూవీలో అడుగులెట్టబోతున్నారు. రెండేళ్ల కిందటే హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ గెర్ష్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఏ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ త్వరలో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే సినిమాలో భాగం కాబోతున్నట్లు అలియా స్వయంగా ప్రకటించింది. టామ్ హార్పర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2023 లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు.

బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నారు. ఇప్పుడు 'మిస్ మార్వెల్' అనే హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. డిస్నీ వారు ఈ ప్రాజెక్ట్ ని రూపొందించనున్నారు. ఇలా చాలా మంది ఇండియన్ స్టార్స్ రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ చిత్రాల్లో సందడి చేయనున్నారు.

ఇప్పటి వరకు ఇర్ఫాన్ ఖాన్ - ఐశ్వర్యారాయ్ - మల్లికా శెరావత్ - టబు - ప్రియాంకా చోప్రా - దీపికా పదుకునే - అనీల్ కపూర్ - ఓం పురి - అనుపమ్ ఖేర్ - నజీరుద్దీన్ షా - సబనా అజ్మీ వంటి పలువురు నటీనటులు హాలీవుడ్ సినిమాలలో నటించారు.