Begin typing your search above and press return to search.

షాకిస్తున్న విల్ స్మిత్ హిందూ భక్తి

By:  Tupaki Desk   |   9 April 2019 8:24 AM GMT
షాకిస్తున్న విల్ స్మిత్ హిందూ భక్తి
X
హాలీవుడ్ లోనే కాస్ట్ లీ స్టార్ గా వెలిగిపోతున్న విల్ స్మిత్ ఇండియా విజిట్ చేయడం.. హిందూ దేవతలను అతడు భక్తి శ్రద్ధలతో కొలవడం ప్రస్తుతం హాట్ టాపిక్. గత కొంతకాలంగా అతడు హరిద్వార గంగ పరిసరాల్లోని దేవాలయాల్లో సంచరిస్తూ అక్కడ కామన్ భక్తులకు పెద్ద సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. అతడు అలా పబ్లిక్ కి కనిపించడంతో పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే అతడి ట్రిప్ కి సంబంధించిన రకరకాల సంగతుల్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేస్తున్నాడు. ఇదివరకూ గంగా హారతికి సంబంధించిన ఫోటోల్ని, అలాగే ఏకాదశి రోజున శివలింగానికి పూజలాచరించిన ఫోటోల్ని రివీల్ చేశారు. యూట్యూబ్, అంతర్జాలంలో అవి జోరుగా వైరల్ అయిపోయాయి. తాజాగా మరోసారి అతడు హిందూ దేవతల్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. విల్ రెండు చేతుల్ని కలిపి దండం పెట్టి పూజిస్తూ ఎంతో అరివీర భక్తుడిలా కనిపించాడు. ఒక పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి.. క్రైస్తవాన్ని ఆచరించే వాళ్లు ఇలా చేయడం నిజంగానే ఆశ్చర్యకరం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోటోకి కోటిన్నర మంది పైగా లైక్ కొట్టడం ఓ సంచలనం.

``మా నాయనమ్మ తరచుగా చెబుతూ ఉండేది. అనుభవం ద్వారానే భగవంతుడు అన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఇండియా పర్యటన నాకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చింది. కొత్త విషయాలు తెలుసుకున్నా`` అని వ్యాఖ్యానాన్ని ఫోటోలకు జోడించాడు విల్ స్మిత్. విల్ స్మిత్ భార‌త సంప్ర‌దాయాల ప‌ట్ల చూపిస్తోన్న ప్రేమ‌కు నేటి జ‌నులు ఫిదా అయిపోతున్నారు. హరిద్వారకు తన ఫేస్ బుక్ వాచ్ షో కోసం విచ్చేసిన విల్ స్మిత్ ఈ టూర్ ని లాంగ్ టైమ్ కి పొడిగించి ఇలా గుడులు గోపురాలు తిరిగేస్తున్నాడు. భారతదేశం నాకు ఎన్నో కొత్త విషయాల్ని అనుభవమయ్యేలా చేసిందని అంత గొప్ప యూనివర్శల్ స్టార్ ఆనందం వ్యక్తం చేయడం మనకు ఓకింత గర్వకారణమే. సెంటిమెంటు వర్కవుటైతే.. ఇకమీదట విల్ స్మిత్ నటించిన సినిమాలకు ఇండియాలోనూ ఆదరణ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. విల్ స్మిత్ నటించిన మెన్ ఇన్ బ్లాక్ సిరీస్ లో కొత్త మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.