Begin typing your search above and press return to search.

సెన్సేష‌న్: మ‌ల్టీప్లెక్సు లో జాతీయ గీతం

By:  Tupaki Desk   |   7 Sep 2015 5:38 PM GMT
సెన్సేష‌న్: మ‌ల్టీప్లెక్సు లో జాతీయ గీతం
X
మల్టీప్లెక్సు అంటే నాలుగు స్క్రీనులు ఒకే చోట చేర్చి.. అందులో దాదాపు రోజుకు ఐదు షోలు వేస్తుంటారు. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో మార్కెట్ మాయాజాలాన్ని సామాన్యుల‌పై రుద్దేస్తున్న మ‌ల్టీప్లెక్స్ క‌ల్చ‌ర్ ఇప్పుడు కాస్త ఎక్కువైంది. చిన్న టౌనుల్లో కూడా ఈ మల్టీ ప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ధియేటర్లలో కొన్ని మంచి కల్చర్‌ లు కూడా ఉంటాయి.

మ‌నం చిన్న‌ప్పుడు స్కూలుకెళ్లి ముందుగా ప్రార్థ‌న చేసేవాళ్లం. విఘ్న వినాయ‌కుని పూజించి, అటుపై వందేమాత‌రం గేయాన్ని, జ‌న‌గ‌న‌మ‌న అధినాయ‌క జ‌య‌హే అంటూ జాతీయ గీతాన్ని ఆల‌పించేవాళ్లం. స్కూల్లో క్లాసులు మొద‌ల‌య్యేముందు ఓ ప్రార్థ‌న గీతం, స్కూలు ముగింపులో మ‌రో ముగింపు గీతం ఉండేవి. కానీ ఇప్పుడు అవ‌న్నీ మ‌ర్చిపోయాం. కానీ అలాంటి దేశ‌భ‌క్తి ని ఇలాంటి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ లో ఓ మారు వినిపిస్తే ఎలా ఉంటుంది? అని భావించారో ఏమో బిగ్ సినిమాస్ సంస్థ త‌మ మ‌ల్టీప్లెక్సుల్లో థియేట‌ర్‌ లో ఆరంభ‌మే జ‌న‌గ‌న‌మ‌న.. పాడిస్తోంది. ఈ మధ్యనే బిగ్‌ సినిమాస్‌ ధియేటర్ లను కార్నివాల్‌ సినిమాస్‌ వారికి అమ్మేశారు. వారు ఈ పద్దతి ప్రవేశపెట్టారులే.

ఇదో కొత్త క‌ల్చ‌ర్‌. న‌వ‌త‌రానికి అవ‌స‌ర‌మైన క‌ల్చ‌ర్‌. మ‌న మూలాల్ని ఓమారు గుర్తు చేసే క‌ల్చ‌ర్‌. ఇలాంటి అద్భుత‌మైన క‌ల్చ‌ర్‌ ని మిగ‌తా మ‌ల్టీప్లెక్సుల్లోనూ పాటించాలి. ఇది స‌ముచితం. సంస్కారం ఉన్న‌వాళ్లు చేసి తీరాలి. ఒక‌వేళ జాతీయ గీతం ఆల‌పిస్తున్నా వెకిలి వేషాలు వేసే వెర్రి వెంగ‌ల‌ప్ప‌ల్ని ఏమీ అన‌లేం.. కాబ‌ట్టి లైట్ తీసుకోవ‌డ‌మే.