Begin typing your search above and press return to search.

స్పెషల్‌ స్టోరి: పాకిస్తాన్‌ లో నిషేధిత సినిమాలు

By:  Tupaki Desk   |   22 July 2015 5:34 PM GMT
స్పెషల్‌ స్టోరి: పాకిస్తాన్‌ లో నిషేధిత సినిమాలు
X
ఒక దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే పాయింట్‌ తో సినిమా తీస్తే ఆ సినిమాని ఆ దేశంలో రిలీజ్‌ చేయడం కుదురుతుందా? అస్సలు కుదరదు. దేశ సమగ్రతను దెబ్బ తీస్తుంది. రాజకీయంగా అలజడి చెలరేగుతుంది. అందుకే అలాంటి ప్రమాదం ఉంది అని గుర్తించిన పాకిస్తానీలు ఓ 7 బాలీవుడ్‌ సినిమాల్ని తమ దేశంలో రిలీజవ్వకుండా అడ్డుకున్నారు. వాటి వివరాలివి..

ఏజెంట్‌ వినోద్‌ (2012) : సైఫ్‌ఖాన్‌ హీరోగా నటించిన భారీ యాక్షన్‌ సినిమా ఇది. స్పై యాక్టివిటీస్‌ కి సంబంధించిన సినిమా ఇది. పాకిస్తాన్‌ కి చెందిన అత్యున్నత అధికారులు, స్పైస్‌ తాలిబన్‌ యుద్ధంలో కీలకపాత్ర పోషించారని ఈ చిత్రంలో చూపించారు. అందుకే అక్కడ బ్యాన్‌ విధించారు.

చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌ : ఈ సినిమా ఈద్‌ టైమ్‌ లో రిలీజ్‌ చేస్తున్నారన్న నెపంతో అక్కడి ప్రభుత్వం రిలీజ్‌ కాకుండా ఆపేసింది. ఓ నాలుగు లోకల్‌ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకే ఆపేస్తున్నామన్నారు. కానీ కారణం వేరే. చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో వివాదాస్పద అంశాలేవీ లేకపోయినా, షారూక్‌ కి పాకిస్తాన్‌ లో ఉన్న అసాధారణ ఫాలోవర్స్‌ వల్ల చిక్కులొస్తాయని పాక్‌ ప్రభుత్వం భావించింది. అందుకే నిషేధం విధించారు.

ఏక్తా టైగర్‌ : సల్మాన్‌ ఖాన్‌ - కత్రిన జంటగా నటించిన ఈ సినిమా 'ఐఎస్‌ ఐ వర్సెస్‌ రా' అనే కాన్సెప్టు తో సాగుతుంది. తీవ్రవాదం హైలైట్‌ గా ఉంటుంది కాబట్టి ఈ సినిమాని పాక్‌ సెన్సార్‌ ఓకే చేయలేదు. ఐఎస్‌ఐ అనే పదం ఎత్తితేనే అక్కడ నిషేధం. ఫలితం రిలీజ్‌ ఆగిపోయిందక్కడ.

భాగ్‌ మిల్కా భాగ్‌ : ఈ సినిమా మిల్కా సింగ్‌ జీవిత కథతో తెరకెక్కించారు. అతడి జీవితం కాశ్మీర్‌ తో ముడిపడి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్‌ ని బ్యాడ్‌గా చూపించినట్టేనని భావించి నిషేధించారు.

డర్టీ పిక్చర్‌: ఊలాలా ఊలాలా అంటూ సిల్కు పాత్రలో విద్యాబాలన్‌ అభినయించిన తీరు చూసి పాక్‌ సెన్సార్‌ బోర్డ్‌ ఉలిక్కి పడింది. ముస్లిమ్‌ మనోభావాల్ని దెబ్బ తీసేలా లేకపోయినా ఓ మగువ ఆ రేంజు లో ఎక్స్‌ పోజ్‌ చేయడం సహించలేరక్కడ. అందుకే నిషేధించారు.

కిలాడి 786 : అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి ఆ నంబరే పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. పాక్‌ లో 786 నంబర్‌ని ప్రత్యేకమైనదిగా భావించి గౌరవిస్తారు. అలాంటి నంబర్‌ ఉన్న టైటిల్‌ తో సినిమా వస్తోంది అంటే పవిత్రంగా ఉండాలి. కామెడీ చేస్తానంటే కుదరదు. అందుకే బ్యాన్‌ విధించారు.

జబ్‌ తక్‌ హై జాన్‌: షారూక్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రంలో పాకిస్తాన్‌ ఆర్మీని కించపరిచేలా కొన్ని డైలాగులు ఉన్నాయని వివాదం చెలరేగింది. అందుకే ఆపేశారు.