Begin typing your search above and press return to search.

మన భామలు ఇంత కష్టపడగలరా?

By:  Tupaki Desk   |   24 April 2018 5:00 AM IST
మన భామలు ఇంత కష్టపడగలరా?
X
ఏమైనా ఫ్యాషన్ విషయంలో బాలీవుడ్ బాలీవుడ్డే అనాలి. ముంబై అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో అందరికీ కలల స్వర్గం.. ఫ్యాషన్ క్యాపిటల్. ఇక్కడ సత్తా చాటగలిగితే ఇండియా అంతా మాత్రమే కాదు.. అదృష్టం బాగుంటే ఆసియా అంతటా.. ఇంకా వెలిగిపోతే ఇంటర్నేషనల్ గాను పేరు తెచ్చుకోవచ్చు.

కానీ ఇక్కడి గ్లామర్ ఫీల్డ్ లో పేరు తెచ్చుకోవాలని కోరుకునే అమ్మాయిలు.. సామాన్యంగా కష్టపడరు. ఫోటో షూట్స్ లో అందాలు చూసి ఆహా అబ్బో అని అంతా అనుకుంటూ ఉంటారు కానీ.. కెరీర్ ఇక్కడివరకు వచ్చేందుకు ముందు చాలానే కథ ఉంటుంది. బాడీ ఫిట్నెస్ కోసం.. ఏళ్ల తరబడి సాధన చేస్తూ ఉంటారు. రోజూ గంటల తరబడి జిమ్ లోనే గడుపుతూ ఉంటారు. ఇందుకోసం లక్షల కొద్దీ ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తారు. ఏతావాతా ఈ కష్టం అంతా కలగలిసి.. కెమేరా ముందుకు వచ్చేసరికి తెగ అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు.

కానీ మన దగ్గర సీన్ వేరేగా ఉంటుంది. ఇండస్ట్రీలో వెలిగిపోవాలని.. టాప్ రేంజ్ కు వచ్చేయాలనే డ్రీమ్స్ అయితే ఉంటాయి కానీ.. ఫిట్నెస్ కోసం ముందుగానే కష్టపడ్డం కనిపించదు. స్లిమ్ గా ఉండడం మాత్రమే ఫిట్నెస్ కాదనే విషయాన్ని ముందునుంచి గ్రహించడం లేదు. ఏదైనా అవకాశం వస్తే.. అప్పుడు హడావిడిగా జిమ్ సెంటర్లను ట్రైనర్లను వెతుక్కుంటూ.. గబగబా కరిగించుకునే హంగామా చేస్తుంటారు. కానీ తాము ఫ్యూచర్ లో స్టార్ అవగలం అనే నమ్మకం ముందు నుంచే పెట్టుకుని.. అందుకు సిద్ధంగా ఉండేవారు మాత్రం అంతగా కనిపించరు.