Begin typing your search above and press return to search.

ఆ క్రికెటర్ కు చైతూ హీరోయిన్ క్లీన్ బౌల్డ్

By:  Tupaki Desk   |   1 Jun 2018 9:30 AM GMT
ఆ క్రికెటర్ కు చైతూ హీరోయిన్ క్లీన్ బౌల్డ్
X
భారత దేశంలో క్రికెట్ ఆటకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లకుండే ఫ్యాన్స్ సినిమా స్టార్లకేమీ తీసిసోదు. క్రికెటర్ల చూపులకు క్లీన్ బౌల్డ్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. చాలాకాలంపాటు ప్రేమ పక్షుల్లా తిరిగిన క్రికెటర్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈమధ్యనే పెళ్లి చేసుకుని మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేశారు.

తాజాగా ఇంకో బాలీవుడ్ హీరోయిన్ ఓ క్రికెటర్ లవ్ మునిగి తేలుతోంది. బెంగుళూరు నుంచి వచ్చిన నిధి అగర్వాల్ మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో నిధికి పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఆమె అందానికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే చందు మొండేటి డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సవ్యసాచి సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ బ్యూటీ ఇప్పుడు కర్ణాటకకు చెందిన యంగ్ క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తోంది. రాహుల్ ఐపీఎల్ లో పెద్దగా రాణించలేకపోయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా బాగానే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

రాహుల్ - నిధి ఇద్దరూ బెంగుళూరు నుంచి వచ్చిన వారే. ఒకే ప్రాంత నుంచి వచ్చిన వారు కావడంతో వీళ్లిద్దరూ తొందరగా కలిసిపోయారనేది బాలీవుడ్ టాక్. ముంబయి పార్టీలు డిన్నర్లలో కలిసే కనిపిస్తున్న ఈ జంట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికైతే తమ రిలేషన్ షిప్ గురించి ఏమీ బయటపెట్టలేదు. ముందుముందు వీరి బంధం ఎంతవరకు బలపడుతుందో చూడాలి.