Begin typing your search above and press return to search.

`భార‌తీయుడు-2` వివాదం స‌యోధ్య‌కు హైకోర్టు జ‌డ్

By:  Tupaki Desk   |   1 July 2021 9:30 AM GMT
`భార‌తీయుడు-2` వివాదం స‌యోధ్య‌కు హైకోర్టు జ‌డ్
X
భార‌తీయుడు 2 (ఇండియ‌న్ 2) వివాదం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడు శంక‌ర్ తో లైకా వివాదం తొలి నుంచి హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య ర‌క‌ర‌కాల అంశాల్లో వివాదాలున్నాయి. కోర్టుల ప‌రిధిలో వాటిపై విచార‌ణ సాగుతోంది.

అయితే దేశ విదేశాల్లో అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న ఈ సినిమా మ‌ధ్యంత‌రంగా ఆగిపోవ‌డం ఎంతో నిరాశ‌కు గురి చేస్తోంది. ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం త్వ‌ర‌గా పూర్త‌యి రిలీజ్ కావాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కానీ అది సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి కనిపించ‌డం లేదు.

తాజాగా `ఇండియన్ 2` కేసులో ప‌రిష్కారం చూపేందుకు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తిని నియమించింది. భార‌తీయుడు 2 వివాదంతో ప‌ని లేకుండా శంక‌ర్ బ్యాక్ టు బ్యాక్ రామ్ చ‌ర‌ణ్ మూవీని అప‌రిచితుడు హిందీ రీమేక్ ని తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా లైకా సంస్థ నిర్బంధ ఉత్తర్వుల విష‌య‌పై హైకోర్టు విచారిస్తోంది. ఇరు పార్టీలు స్నేహపూర్వక పరిష్కారానికి రావడానికి కోర్టు ఇప్పటికే సమయం కేటాయించింది.

నేడు ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సంక్లిష్ట‌మైన‌ సమస్యను పరిష్కరించడానికి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి భానుమతిని మధ్యవర్తిగా నియమించింది. వివాదం క‌నీసం ఇప్పుడైనా ప‌రిష్కృతం అవుతుందా లేదా అన్న‌ది చూడాలి.