Begin typing your search above and press return to search.

రీల్ 'విలన్'కి జై కొడుతున్న భారత్!

By:  Tupaki Desk   |   28 May 2020 1:30 AM GMT
రీల్ విలన్కి జై కొడుతున్న భారత్!
X
ప్రస్తుతం కరోనాని అరికట్టడానికి కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలకి సహకారం అందించాలని కోరాయి. ఇక డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా, పారిశుద్ధ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు. కరోనా పై వైద్య సిబ్బంది చేస్తున్న సహకారానికి దేశం మొత్తం ఇప్పుడు సలాం కొడుతోంది. అయితే నిత్యం మనకోసం పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం చేసేందుకు సోనూసూద్ ఇదివరకే ముందుకు వచ్చాడు. అంతేగాక లాక్ డౌన్ కారణంగా ఉపాథి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం అందిస్తున్నాడు. అది కూడా వంద మందికో, 200 మందికో కాదు.. ప్రతి రోజూ 45వేల మందికి ఆహారం అందిస్తున్నాడు సోను. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తో కలిసి అంధేరి, జుహు, బాంద్రా ప్రాంతాల్లో ఉన్న పేదలందరికీ ఉచితంగా ప్రతి రోజూ ఆహారం అందిస్తున్నాడు. ఒకవేళ లాక్ డౌన్ ను పొడిగించినా తను తగ్గనని, లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు పేదలకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తానని చెబుతున్నాడు. ఇదీ సోనూసూద్ మంచి మనసుతో చేసిన పని.

ఈ నేపథ్యంలో ఉపాధిలేక చిక్కుకున్న వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించారు. ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడుతున్న ఈ తరుణంలో ప్రతి భారతీయుడు తమ కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే దేనితోనైనా పోరాడగలడనేది నా నమ్మకం. కొందరు వలస కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించేందుకు నేను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి అధికారికంగా అనుమతులు తీసుకున్నా. పది బస్సులలో వారు ప్రయాణిస్తున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయి. పిల్లలు, వృద్ధులతో కూడిన వలస కార్మికుల్ని రోడ్లపై చూసి నా హృదయం ద్రవించింది. కేవలం ఈ రెండు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాల్లోని వలస కార్మికులకు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఈ సందర్భంగా సోనూసూద్‌ తెలిపారు. ఈ సందర్భంగా సోనూసూద్ ఛారిటీ సహాయంతో ఇప్పటి వరకు 12వేల మంది వలస కార్మికులు సొంతిళ్లకు చేరినట్లు తెలుస్తుంది. కేవలం ఒక్కడి తపన.. సంకల్పం అంతమందికి బతుకు బాట చూపిస్తుంది. అతని సేవలకు జై కొడుతోంది భారత్.