Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ స్పీడ్ పెంచండి బాసూ..!

By:  Tupaki Desk   |   6 Sep 2022 5:33 AM GMT
ప్రమోషన్స్ స్పీడ్ పెంచండి బాసూ..!
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో వస్తున్న 153వ చిత్రం "గాడ్‌ ఫాదర్". మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషన్స్ విషయంలో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా 'గాడ్ ఫాదర్' మూవీ రాబోతోంది. రీమేక్‌ అయినప్పటికీ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా మార్పులు చేసినట్లుగా టీజర్ ని బట్టి అర్థమవుతుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

సినిమా రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. కానీ మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. 'గాడ్ ఫాదర్' నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మరియు టీజర్ వచ్చాయి. ఇందులో చిరు లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నప్పటీ.. కంటెంట్ ఊహించిన విధంగా లేదని కామెంట్స్ వచ్చాయి.

విజయదశమి బరిలో దిగుతున్న మిగతా సినిమాలు ఏదొక అప్డేట్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా.. 'గాడ్ ఫాదర్' మాత్రం ఏవిధంగానూ బజ్ క్రియేట్ చేయడం లేదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే దీనికి కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కోవాలని కొణిదెల ప్రొడక్షన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ మొదటి నుంచీ కూడా ప్రమోషన్స్ విషయంలో ఇలానే వ్యవహరిస్తోందని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 'సైరా నరసింహా రెడ్డి'.. ఇటీవల 'ఆచార్య' సినిమాలకు ఆశించిన మేరకు ప్రచారం చేయలేదని.. వాటి నుంచైనా గుణపాఠం నేర్చుకోలేదని అంటున్నారు.

'గాడ్ ఫాదర్' తర్వాత చిరు ఇకపై సొంత బ్యానర్ లో మరో సినిమా చేయకూడదని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్ చేస్తుండటం పై ట్రోల్స్ ఎదుర్కొంటుండగా.. ఇప్పుడు మేకర్స్ సరిగ్గా ప్రచారం చేయకపోవడం నిరుత్సాహానికి గురి చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటి నుంచైనా ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు.

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వకపోతే.. అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం చూస్తుంటాం. యూవీ క్రియేషన్స్ - మైత్రీ మూవీ మేకర్స్ పై తరుచుగా ఇలాంటివి వస్తుంటాయి. అదే విధంగా ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్ పై ఫ్యాన్స్ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. నయనతార - సత్యదేవ్ - సునీల్ ఇతర పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.