Begin typing your search above and press return to search.

విజయ్ ఇంటిపై ఐటీ దాడులు..

By:  Tupaki Desk   |   29 Sept 2018 2:46 PM IST
విజయ్ ఇంటిపై ఐటీ దాడులు..
X
విజయ్ సేతుపతి .. తమిళంలో అగ్ర హీరో.. చిరంజీవి 151 మూవీ ‘సైరా’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘నవాబ్’ తెలుగులోకి డబ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. తమిళంలో విలక్షణ చిత్రాలు తీస్తూ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నటుడిపై ఐటీ దాడులు తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. తన పని తాను చేసుకుపోయే నటుడి ఇంటిపై దాడులు జరగడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ విషయం తాజాగా తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

మూడు రోజుల క్రితం విజయ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు ఈ దాడులు జరిగాయని ఆయన సన్నిహితుల ద్వారా లీక్ అయ్యింది. అయితే ఇవి సాధారణ ఐటీ సోదాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది దుమారం రేగడంతో ఐటీ అధికారులు కూడా స్పందించారు. ఇవి రొటీన్ గా నిర్వహించిన దాడులేనని వివరణ ఇచ్చారు. అయితే విజయ్ లాంటి నటుడిపై దాడులు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెన్నై సినీ పరిశ్రమ నిరసన తెలిపినట్టు సమాచారం.

ఐటీ దాడుల వ్యవహారం మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో ఈ వ్యవహారంపై అటు విజయ్ కానీ, ఆయన సన్నిహితులు కానీ నోరుమెదపడం లేదు. ఇటీవల నవాబ్ బంపర్ హిట్ కావడంతో ఆ సినిమా హీరో విజయ్ పై దాడులు జరిగినట్టు పరిశ్రమ వర్గాలు అనుమానిస్తున్నాయి.