Begin typing your search above and press return to search.

కలెక్షన్స్ పరంగా జాతిరత్నాలు తగ్గుముఖం పడుతోందా..??

By:  Tupaki Desk   |   16 March 2021 10:33 AM GMT
కలెక్షన్స్ పరంగా జాతిరత్నాలు తగ్గుముఖం పడుతోందా..??
X
సినీఇండస్ట్రీలో లాక్ డౌన్ తర్వాత ప్రతివారం చాలా పెద్దసంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. ఒకప్పుడు అంటే వారానికి ఒకటి రెండు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు పూర్తిగా రోజులు మారిపోయాయి. వారానికి నాలుగు సినిమాల పైనే విడుదల అవుతుండటం గమనార్హం. అదిగాక ఈ కాలంలో సినిమాల ఫలితాలు ఒక్కరోజులోనే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఏ సినిమాకైనా మొదటి సోమవారం చాలా ముఖ్యమైనది. అది చిన్నసినిమా కావచ్చు లేదా స్టార్ హీరో సినిమా కావచ్చు. ఆ వారంలో ఎంత కలెక్ట్ చేసాయో పక్కనపెడితే మండే రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూస్తుంటారు. అయితే మొదటి నాలుగు రోజులుమంచి కలెక్షన్స్ రాబట్టిన జాతిరత్నాలు సినిమా.. సోమవారం అవేరేజ్ కలెక్షన్స్ రాబట్టింది.

ఈ వారం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయస్ గా నిలిచిన జాతిరత్నాలు మూవీ.. సోమవారం ఆంధ్రాలో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయని సమాచారం. ఆశ్చర్యకరంగా కొన్ని చోట్ల చాలా షోలు 50% కంటే తక్కువ సీటింగ్ నమోదు అయ్యిందట. కానీ తెలంగాణలో మాత్రం జాతిరత్నాలు ఇంకా విజయవంతంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాలలో స్థిరమైన కలెక్షన్స్ కలిగి ఉంది. షోలు, థియేటర్ల సంఖ్య పెరిగిన తర్వాత మల్టీప్లెక్స్ లలో హౌస్ ఫుల్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హౌస్ ఫుల్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం ఆశ్చర్యం. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ఫరియా హీరోహీరోయిన్లుగా నటించారు. కేవీ అనుదీప్ దర్శకత్వం వహించగా నాగ్ అశ్విన్ నిర్మించాడు.