Begin typing your search above and press return to search.

మెగా 'గాడ్‌ ఫాదర్‌' లో ఎవరు ఎవరు ఏంటీ?

By:  Tupaki Desk   |   16 April 2022 4:32 AM GMT
మెగా గాడ్‌ ఫాదర్‌ లో ఎవరు ఎవరు ఏంటీ?
X
మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ ను తెలుగు లో గాడ్ ఫాదర్ పేరు తో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. రీమేక్‌ షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది. చిత్రీకరణ పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా పూర్తిగా స్టార్స్ తో నిండి పోయింది. గాడ్ ఫాదర్ లో మెగా స్టార్‌ చిరంజీవి నటిస్తున్నాడు అంటేనే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఇప్పుడు చిరంజీవికి తోడు గా సల్మాన్ ఖాన్.. సునీల్‌.. నయనతార.. సత్యదేవ్‌.. పూరి జగన్నాద్‌.. అనసూయ ఇంకా పలువురు స్టార్స్ కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. లూసీఫర్ తో పోల్చితే గాడ్ ఫాదర్ లో స్టార్‌ కాస్ట్‌ ఎక్కువగా కనిపిస్తుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈమద్య కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమా రాకపోవడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ స్టార్‌ కాస్టింగ్ తో రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌ పాత్ర ఏంటీ అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్‌ గా ఉంటుందని.. చిరంజీవి పాత్రకు ఆప్తుడిగా సల్మాన్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నయనతార ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కనిపించబోతుందట. ఇక నయన్‌ భర్త పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు.

సినిమాలో మెయిన్‌ విలన్ గా ఆయనే కనిపించబోతున్నాడు. ఇక సునీల్‌ చిరంజీవికి అనుచరుడిగా కనిపించబోతున్నాడని.. అనసూయ ఒక మీడియా సంస్థ అధినేత పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక పూరి జగన్నాద్ ఈ సినిమాలో సీనియర్ జర్నలిస్ట్‌ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమాలోని ప్రతి పాత్రకు కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంటుందని.. సినిమాలోని ప్రతి సన్నివేశంలో కూడా ప్రముఖ నటీ నటులు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆచార్య సినిమా ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆచార్య విడుదల అయిన కొద్ది గ్యాప్‌ లోనే మెగా గాడ్ ఫాదర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.