Begin typing your search above and press return to search.

2021లో క్రీడా నేప‌థ్య‌ సినిమాలదే హ‌వా

By:  Tupaki Desk   |   9 April 2021 5:00 AM IST
2021లో క్రీడా నేప‌థ్య‌ సినిమాలదే హ‌వా
X
బ‌యోపిక్ ల వెల్ల‌వ‌లో క్రీడా బ‌యోపిక్ ల‌కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. నిజ జీవిత క‌థ‌ల‌తో పాటు ఫిక్ష‌నల్ క‌థాంశాల్ని క్రీడా నేప‌థ్యం జోడించి సినిమాలుగా తెర‌కెక్కించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హీరోలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. అలా 2021 క్రీడా నేప‌థ్య సినిమాల‌దే హ‌వా. ఇప్ప‌టికే డ‌జ‌ను పైగానే స్పోర్ట్స్ నేప‌థ్య సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి హ‌వా సాగిస్తున్న తాప్సీ ఒక‌దాని వెంట ఒక‌టిగా మూడు క్రీడా బ‌యోపిక్ కేట‌గిరీ చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌హిళా క్రికెట‌ర్ మిథాలీరాజ్ బ‌యోపిక్ షాభాస్ మిత్తులో తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తోంది. రాహుల్ దోలాఖియా ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం ఇటీవ‌లే మొద‌లైంద‌ని తాప్సీ వెల్ల‌డించారు. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో ర‌‌ష్మి రాకెట్ కూడా ఇంత‌కుముందు మొద‌లైంది. ఆకాష్ ఖురానా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఇది చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇవేగాక‌.. మ‌రిన్ని బ‌యోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి.

బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ బ‌యోపిక్ లో ప‌రిణీతి చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఆమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే ఈ చిత్రం మిడ్ వేలో ఉంది. జెర్సీ హిందీ రీమేక్- షాహిద్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా తెలుగు వెర్ష‌న్ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రాన్ని హిందీలోనూ తెర‌కెక్కిస్తున్నారు. జెర్సీకి రెండు జాతీయ అవార్డులు ద‌క్క‌గా రెట్టించిన ఉత్సాహంతో గౌత‌మ్ ప‌ని చేస్తున్నారు.

83 - క‌పిల్ దేవ్ బ‌యోపిక్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో క‌పిల్ దేవ్ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌గా.. అత‌డి భార్యామ‌ణి దీపిక తెర‌పైనా భార్య‌గానే న‌టిస్తున్నారు. ఈ సినిమాకి దీపిక స‌హ‌నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. ఫ‌ర్హాన్ అక్త‌ర్ తూఫాన్ అనే స్పోర్ట్స్ మూవీలో న‌టిస్తున్నారు. చెస్ గ్రాండ్ మాస్ట‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్ బ‌యోపిక్ ని ఆనంద్ .ఎల్ రాయ్ తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. తుల‌సీదాస్ జూనియ‌ర్ అనే క్రీడా నేప‌థ్య‌ చిత్రంలో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు.

అర్జున్ రెడ్డి త‌మిళ‌ రీమేక్ `వర్మ`తో హీరోగా ప‌రిచ‌యం అయిన చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధ్రువ్ విక్రమ్ త‌దుప‌రి స్పోర్ట్స్ డ్రామాను లాక్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ఆటగాడిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం తమిళనాడు గ్రామీణ ప్రాంతం నుండి క్రీడాకారుడిగా ఎదిగి.. చివరకు దేశం అత్యున్నత క్రీడా గౌరవాన్ని గెలుచుకోవటానికి కార‌కుడైన ప్ర‌తిభావంతుడి క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఆసియా క్రీడలలో భార‌త‌ దేశానికి బంగారు పతకం సాధించిన కబడ్డీ ఆటగాడి నిజమైన కథ ఆధారంగా రూపొందించనున్నారు.

బాలీవుడ్ యువ‌న‌టుడు కార్తీక్ ఆర్య‌న్ స్పోర్ట్స్ బ‌యోపిక్ ని లాక్ చేశార‌న్న‌ది తాజా స‌మాచారం. బెంగాలీ చిత్రం `గోలోండాజ్` స్పోర్ట్స్ బయోపిక్‌. స్వాతంత్ర‌ దినోత్సవ వారాంతంలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం భారత ఫుట్‌బాల్ పితామహుడిగా భావించే నాగేంద్ర ప్రసాద్ జీవిత‌ కథ.

నిజానికి స్పోర్ట్స్ బయోపిక్స్ పై భారతీయ సినిమా రంగంలో ఉన్న ప్రేమ రిలీజ్ కి వ‌స్తున్న సినిమాల‌ రూపంలో స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ లో రణ్‌వీర్ సింగ్ 83 విడుద‌ల కానుంది. త‌దుప‌రి అజయ్ దేవ్‌గన్ నిజ జీవిత ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ నటించిన మైదాన్ అక్టోబర్ లో విడుదల కానుంది. మ‌రో డ‌జ‌ను పైగానే చిత్రాలు ఈ ఏడాది విడుద‌ల కానున్నాయి. సెకండ్ వేవ్ ఫేట్ మార్చ‌క‌పోతే క్రీడాభిమానుల‌కు విజువ‌ల్ ఫెస్ట్ ముందుంది.