Begin typing your search above and press return to search.

రొమాంటిక్ నెంబర్ తో ఆకట్టుకుంటున్న 'అల్లుడు అదుర్స్'

By:  Tupaki Desk   |   8 Jan 2021 3:31 PM GMT
రొమాంటిక్ నెంబర్ తో ఆకట్టుకుంటున్న అల్లుడు అదుర్స్
X
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అల్లుడు అదుర్స్. ఇదివరకే వీరి కాంబినేషన్ లో అల్లుడుశీను, జయజానకి నాయక ఆడియో ఆల్బమ్స్ మంచి సక్సెస్ అందుకున్నాయి. డిఎస్పి సంగీతం అంటేనే యువతకు బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇక హ్యాట్రిక్ మూవీ అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు అదే అంచనాల మధ్య విడుదల కాబోతుంది అల్లుడు అదుర్స్. ఇటీవల ఈ సినిమా నుండి 'హోలా చికా.. హోలా చికా.." అంటూ సాగే ఓ జోష్ ఫుల్ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది అల్లుడు అదుర్స్ చిత్రబృందం. ఇప్పటికే బెల్లంకొండ ఫ్యాన్స్ లో మోషన్ పోస్టర్, సాంగ్ న్యూ లుక్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. తాజాగా రెండో సాంగ్ 'పడిపోయా.. పడిపోయా..' పాటతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. లవర్ బాయ్ క్యారెక్టర్ లో శీను, క్యూట్ అమ్మాయిగా అను ఇమ్మానుయేల్ కొత్తగా కనిపిస్తున్నారు.

ఈ దేవిశ్రీ మార్క్ రొమాంటిక్ నెంబర్ లలో ఈ పడిపోయా కూడా చేరుతుంది. హీరోయిన్ని చూసి హీరో లవ్ లో పడిపోయా అంటూ హీరో రొమాంటిక్ గా పాడుతున్నట్లు కనిపిస్తుంది. క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అను పాటకు అందం తీసుకొచ్చింది. ఇక పాట రచయిత భాస్కర భట్ల అందించిన లిరిక్స్ చాలా రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తాయి. యూత్ కి కావాల్సిన విషయాలన్నీ జోడించి పాటకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఇక బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ గాత్రం మంచి ఫీల్ అందిస్తుంది. ఇప్పటికే జావెద్ పాడిన 'నీ కన్ను నీలి సముద్రం' సాంగ్ మర్చిపోక ముందే మరో మెలోడీతో ఆకర్షిస్తున్నాడు. మొత్తానికి అల్లుడు అదుర్స్ నుండి విడుదలైన సెకండ్ సాంగ్ అదుర్స్ అనే చెప్పాలి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ తో పాటు నభా నటేష్ కూడా నటించింది. చూడాలి మరి అల్లుడు అదుర్స్ ఎలా ఆకట్టుకుంటాడో..!!